News March 16, 2025
వరంగల్ మార్కెట్ రేపు పునః ప్రారంభం

మూడు రోజుల విరామం అనంతరం వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్ సోమవారం పునః ప్రారంభం కానుంది. శుక్రవారం హోలీ సందర్భంగా మార్కెట్ బంద్ ఉంది. నిన్న, ఈరోజు వారాంతపు సెలవులు కావడంతో మార్కెట్ బంద్ ఉంది. దీంతో రేపు ప్రారంభం కానుండగా.. రైతులు నాణ్యమైన సరుకులను మార్కెటుకు తీసుకొని వచ్చి మంచి ధర పొందాలని అధికారులు సూచించారు. కాగా ఉదయం 6 గంటల నుంచి మార్కెట్లో కొనుగోళ్లు ప్రారంభం కానున్నాయి.
Similar News
News March 18, 2025
ప్రభుత్వ కొలువు సాధించిన కల్వరాల యువకుడు

నిన్న విడుదల చేసిన TGPSC తెలంగాణ హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్స్ ఫలితాల్లో వనపర్తి(D) వీపనగండ్ల(M) కల్వరాల గ్రామానికి చెందిన పాశమోని కృష్ణయ్య- చిట్టెమ్మ దంపతుల కుమారుడు పాపమని నరేష్ హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్‌గా ప్రభుత్వ ఉద్యోగానికి ఎంపికయ్యాడు. ఈ సందర్భంగా గ్రామస్థులు నరేశ్‌ను అభినందిస్తున్నారు.
News March 18, 2025
ప్రకాశం: ఉచిత ఇంటర్ విద్యకు దరఖాస్తుల ఆహ్వానం

ప్రకాశం జిల్లాలోని 6 మోడల్ స్కూల్స్‌లో 2025-26 విద్యా సంవత్సరంకు ఉచిత విద్యకై ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరంలో, విద్యార్థుల ప్రవేశం కొరకు ఆన్లైన్ ద్వారా దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లుగా డీఈఓ కిరణ్ కుమార్ ఒక ప్రకటన ద్వారా తెలిపారు. పదవ తరగతిలో ఉత్తీర్ణులైన విద్యార్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నామన్నారు. మే 22వ తేదీలోపు ఆన్లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని డీఈవో పేర్కొన్నారు.
News March 18, 2025
సంగారెడ్డి: ఈతకు వెళ్లిన యువకుడు మృతి

ఈతకు వెళ్లిన యువకుడు మృతి చెందిన ఘటన సంగారెడ్డి మండలం కల్పగురు శివారులోని మంజీరా డ్యాంలో జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. ఆందోల్ మండలం కుమ్మరిగూడెంకు చెందిన నరేష్ తమ్ముడు నరేంద్రతో కలిసి ఆదివారం మంజీరా డ్యామ్‌కు వెళ్లారు. నరేష్ ఈత కొడుతుండగా నదిలో మునిగిపోయాడు. గజ ఈతగాళ్ల సహాయంతో సోమవారం మృతదేహాన్ని వెలికి తీశారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.