News December 27, 2024

వరంగల్ మార్కెట్‌లో చిరు ధాన్యాల ధరల వివరాలు

image

వరంగల్ నగరంలోని ఎనుమాముల వ్యవసాయ మార్కెట్‌లో ఈరోజు వివిధ రకాల చిరు ధాన్యాల ధరలు ఇలా ఉన్నాయి. శుక్రవారం క్వింటా మొక్కజొన్న ధర రూ.2,505 పలకగా ఈరోజు రూ.2,490 ధర పలకింది. సూక పల్లికాయ ధర రూ. 6,200, పచ్చి పల్లికాయ రూ.5,200 పలికాయి. అలాగే కొత్త 341 రకం మిర్చి రూ.14వేలు, కొత్త తేజ మిర్చి రూ. 16,016, దీపిక మిర్చి రూ.13 వేలు పలికినట్లు రైతులు తెలిపారు.

Similar News

News February 5, 2025

WGL: విషాదం.. గుండెపోటుతో యువకుడు మృతి

image

వరంగల్ జిల్లాలో గుండెపోటుతో మరణిస్తున్న వారి సంఖ్య పెరుగుతోంది. ఈరోజు ఉదయం ఓ యువకుడు హార్ట్ ఎటాక్‌తో మరణించాడు. నగరంలోని డాక్టర్స్ కాలనీకి చెందిన కుమారస్వామి(33) ఈరోజు ఉదయం అకస్మాత్తుగా గుండెపోటుకు గురయ్యాడు. దీంతో కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించగా అప్పటికే మరణించినట్లు వైద్యులు తెలిపారు. మృతుడికి భార్య, 3 నెలల పాప ఉంది. దీంతో ఆ కుటుంబంలో విషాదం నెలకొంది.

News February 5, 2025

వరంగల్: తాత అంత్యక్రియలకు వెళ్లి మనవడు మృతి

image

వరంగల్ జిల్లాలో విషాదం జరిగింది. స్థానికులు తెలిపిన వివరాలు.. దుగ్గొండి మండలం మైసంపల్లికి చెందిన వృద్ధుడు పిట్టల మల్లయ్య అనారోగ్యంతో సోమవారం సాయంత్రం మృతిచెందాడు. కాగా అంత్యక్రియల్లో పాల్గొని చెరువులో స్నానం చేస్తున్న క్రమంలో మల్లయ్య మనవడు పిట్టల రంజిత్ ప్రమాదవశాత్తు చెరువులో మునిగిపోయాడు. అతడిని వెంటనే ఆస్పత్రికి తరలించగా చికిత్సపొందుతూ ఈరోజు చనిపోయాడు. తాత,మనవడు మృతితో కుటుంబంలో విషాదం నెలకొంది.

News February 5, 2025

మట్టెవాడ క్రైం కానిస్టేబుల్‌‌కు ప్రశంసాపత్రం అందజేత

image

రాష్ట్రంలోనే కాకుండా ఇతర రాష్ట్రాల్లోనూ జరిగిన దొంగతనాలను విశ్లేషించి చోరీలకు పాల్పడిన దొంగల వివరాలను సంబంధిత జిల్లాల పోలీస్ అధికారులకు సమాచారం అందిస్తున్న మట్టెవాడ క్రైం కానిస్టేబుల్ అలీకి వరంగల్ సీపీ అంబర్ కిశోర్ ప్రశంసా పత్రం అందించారు. కేరళలోని తిరువనంతపురం, కొచ్చికి చెందిన పోలీస్ కమిషనర్లతో పాటు వికారాబాద్ ఎస్పీ అలీని అభినందిస్తూ తెలుపుతూ జారీ చేసిన ప్రశంసాపత్రాలను సీపీ అందజేశారు.

error: Content is protected !!