News April 2, 2025
వరంగల్ మార్కెట్‌లో చిరుధాన్యాల ధరలు

వరంగల్ ఎనుమాముల మార్కెట్‌లో బుధవారం చిరుధాన్యాల ధరలు ఇలా ఉన్నాయి. సూక పల్లికాయ క్వింటా ధర రూ.5,900, పచ్చి పల్లికాయ రూ.4,850 పలికింది. పసుపు (కాడి) క్వింటా ధర రూ.12,359, పసుపు (గోల)కి రూ.10,729 వచ్చింది. మరోవైపు మక్కలు (బిల్టీ) క్వింటా ధర రూ.2,285 పలికినట్లు అధికారులు వెల్లడించారు.
Similar News
News April 4, 2025
కమిన్స్ కెప్టెన్సీపై విమర్శలు.. స్పిన్నర్లు ఉన్నా..!

IPL-2025 సీజన్లో కమిన్స్ కెప్టెన్సీపై విమర్శలు వస్తున్నాయి. నిన్న ఈడెన్ గార్డెన్స్‌లో KKRపై మ్యాచులో సరిగా బౌలింగ్ మార్పులు చేయలేకపోయారు. స్పిన్నర్లు రెండు వికెట్లు తీసినా వారిని కంటిన్యూ చేయలేదు. 8 ఓవర్లు స్పిన్నర్లు వేసేందుకు ఛాన్స్ ఉన్నా పేసర్లతో వేయించి మూల్యం చెల్లించుకున్నారు. మరోవైపు కేకేఆర్ స్పిన్నర్లు వరుణ్ చక్రవర్తి, సునీల్ నరైన్ కలిసి 8 ఓవర్లలో 4 వికెట్లు తీసి SRHను దెబ్బకొట్టారు.
News April 4, 2025
సామర్లకోట: మున్సిపల్ ఛైర్ పర్సన్‌తో సహా మరో నేతపై వైసీపీ సస్పెన్షన్ వేటు

సామర్లకోట మున్సిపల్ ఛైర్పర్సన్ గంగిరెడ్డి అరుణ కృష్ణమూర్తితో సహా జడ్పీటీసీ భర్త సూర్యనారాయణ మూర్తి (నరేశ్)పై వైసీపీ సస్పెన్షన్ వేటు వేసినట్లు పార్టీ నేతలు స్పష్టం చేశారు. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారనే ఆరోపణల నేపథ్యంలో వైసీపీ అధినేత జగన్ ఆదేశాల మేరకు పెద్దాపురం ఇన్‌ఛార్జ్ దొరబాబు ఆధ్వర్యంలో ఆ ఇద్దరు నేతలపై సస్పెన్షన్ వేటు వేసినట్లు వెల్లడించారు.
News April 4, 2025
వికారాబాద్: భార్యను తిట్టాడని కొట్టి చంపాడు!

తన భార్యను అసభ్యంగా తిడుతున్నాడని కోపోద్రిక్తుడైన వ్యక్తి కర్రతో చితకబాదడంతో వృద్ధుడు మృతి చెందాడు. ఎస్ఐ అరవింద్ వివరాలు.. మోమిన్‌పేట్ మం. ఏన్కతలలో కిష్టయ్య (75) వికలాంగ వృద్ధుడు. తన ఇంటి పక్క మహిళను అసభ్యంగా తిడుతున్నాడని ఆమె భర్త కర్రతో కొట్టాడు. తీవ్రగాయాలు కావడంతో చనిపోయాడని కిష్టయ్య పెద్ద కుమారుడు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు ఎస్ఐ అరవింద్ వెల్లడించారు.