News April 24, 2024

వరంగల్ మార్కెట్లో తగ్గిన పత్తి ధర

image

వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్లో పత్తి ధర నిన్నటితో పోలిస్తే ఈరోజు పత్తి ధర స్వల్పంగా తగ్గింది. నిన్న రూ.7,150 పలికిన క్వింటా పత్తి ఈరోజు రూ.7100 ధర పలికినట్లు అధికారులు తెలిపారు. మార్కెట్లో కొనుగోళ్ల ప్రక్రియ జోరుగా కొనసాగుతుంది. పత్తి ధర రోజురోజుకు తగ్గుతుండడంతో రైతన్నలు తీవ్ర నిరాశ చెందుతున్నారు.

Similar News

News February 5, 2025

వరంగల్: క్వింటా పత్తి ధర రూ. 6,980

image

వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్‌లో బుధవారం పత్తి ధర స్వల్పంగా పెరిగింది. సోమవారం క్వింటా పత్తి ధర రూ.7,000 పలకగా.. మంగళవారం రూ.6,960కి పడిపోయింది. అలాగే నేడు రూ.20 పెరిగి రూ.6,980 కి చేరినట్లు మార్కెట్ ఉన్నతశ్రేణి కార్యదర్శి నిర్మల తెలిపారు. గత వారం క్రమంగా పెరుగుతూ వచ్చిన పత్తి ధర ఇప్పుడు తగ్గుతుండటంతో రైతన్నలు ఆవేదన చెందుతున్నారు.

News February 5, 2025

కొమ్మాలలో అద్భుతం.. సూర్య కిరణాల మధ్య లక్ష్మీనరసింహస్వామి

image

గీసుగొండ మండలం కొమ్మాల గ్రామంలో ప్రసిద్ధిగాంచిన శ్రీ కొమ్మాల లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో రెండు గుట్టల నడుమ ఉన్న నరసింహస్వామి విగ్రహాలను బుధవారం ఉదయం పూజా సమయంలో సూర్యకిరణాలు తాకాయి. సూర్యకిరణాల తాకిడితో నరసింహస్వామి ప్రతిబింబం మెరుస్తూ కనిపించింది. ఆలయానికి వచ్చిన భక్తులు ఈ అద్భుత దృశ్యాన్ని కెమెరాల్లో బంధించారు.

News February 5, 2025

కేయూ: 20 నుంచి పీజీ మొదటి సెమిస్టర్ పరీక్షలు

image

కేయూ పీజీ కోర్సుల మొదటి సెమిస్టర్ పరీక్షలు ఈనెల 20 నుంచి జరగనున్నాయని ప్రొఫెసర్ రాజేందర్, ఆచార్య బీఎస్ఎల్ సౌజన్య ప్రకటనలో తెలిపారు. ఎంఏ, ఎంకాం, ఎమ్మెస్సీ ఎంటీఎం, ఎంఎస్‌డబ్ల్యూ, ఎంహెచ్ఆర్ఎం, ఎంఎల్ఐఎస్సీ కోర్సులకు మొదటి సెమిస్టర్ 20, 22, 24, 27, మార్చి 1, 3 తేదీల్లో నిర్వహించనున్నట్లు చెప్పారు. మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పరీక్షలు జరుగుతాయన్నారు.

error: Content is protected !!