News February 12, 2025

వరంగల్ మార్కెట్లో భారీగా పతనమైన పత్తి ధర

image

వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్లో నేడు పత్తి ధర భారీగా పతనమైంది. నిన్న మంగళవారం క్వింటా పత్తి ధర రూ.7,060 పలకగా.. నేడు రూ.6,950కి పడిపోయినట్లు వ్యాపారులు తెలిపారు. ఒకరోజు వ్యవధిలోనే రూ.110 ధర తగ్గడంతో రైతన్నలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ధరలు పెరిగేలా అధికారులు, వ్యాపారులు ప్రత్యామ్నాయ చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

Similar News

News April 23, 2025

వరంగల్: గ్రేట్.. ఒకే ఏడాదిలో 11 మందికి ఆర్మీలో జాబ్స్

image

వరంగల్ జిల్లా ఖానాపురం మండలం అశోక్ నగర్‌లోని గిరిజన సంక్షేమ సైనిక్ స్కూల్ నుంచి ఒకే ఏడాదిలో 11 మంది అగ్నివీర్‌లో ఉద్యోగాలు సాధించారు. గత నెలలో ఇదే పాఠశాలకు చెందిన 8 మందికి జాబ్స్ వచ్చాయి. రెండు రోజుల క్రితం విడుదలైన రెండో విడత ఫలితాల్లో మరో ముగ్గురికి కేంద్ర ప్రభుత్వ కొలువులు వచ్చాయి. ఉపాధ్యాయుల అంకితభావంతోనే ఈ ఫలితాలు సాధించినట్లు ప్రిన్సిపల్ సురేందర్ తెలిపారు.

News April 23, 2025

వరంగల్ చపాటా అంటే నర్సంపేటనే..!

image

చపాటా మిర్చి పంట సాగుకు ఉమ్మడి వరంగల్ జిల్లా పెట్టింది పేరు. కానీ ఉమ్మడి జిల్లాలో ఎక్కువగా సాగయ్యేది నర్సంపేట నియోజకవర్గంలో మాత్రమే. విదేశాల్లో మంచి డిమాండ్ ఉన్న ఈ చపాటా మిర్చిని మొదట నల్లబెల్లికి చెందిన రైతులు సాగు చేశారు. తర్వాత నల్లబెల్లి, నర్సంపేట, దుగ్గొండి, చెన్నారావుపేట, నెక్కొండ తదితర మండలాల్లోని రైతులు ఈ రకం మిర్చి సాగుకు ఆసక్తి చూపుతున్నారు. ఇటీవల ఈ మిర్చికి భౌగోళిక గుర్తింపు వచ్చింది.

News April 23, 2025

వరంగల్: ఇంటర్ ఫలితాల్లో సత్తా చాటిన ప్రభుత్వ కళాశాలలు

image

ఇంటర్మీడియట్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం పరీక్షల ఫలితాలు మంగళవారం మంగళవారం వెలువడ్డాయి. ఫలితాల్లో వరంగల్ జిల్లాలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలు సత్తా చాటినట్లు డీఐఈవో డా.శ్రీధర్ సుమన్ తెలిపారు. గత సంవత్సరం కన్నా ఈ సంవత్సరం 4 శాతం ఉత్తీర్ణత పెరిగిందని, జిల్లా స్థాయిలో ప్రతిభావంతులైన విద్యార్థులను తగు రీతిలో సత్కరించనున్నట్లు తెలిపారు..

error: Content is protected !!