News February 12, 2025

వరంగల్ మార్కెట్లో భారీగా పతనమైన పత్తి ధర

image

వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్లో నేడు పత్తి ధర భారీగా పతనమైంది. నిన్న మంగళవారం క్వింటా పత్తి ధర రూ.7,060 పలకగా.. నేడు రూ.6,950కి పడిపోయినట్లు వ్యాపారులు తెలిపారు. ఒకరోజు వ్యవధిలోనే రూ.110 ధర తగ్గడంతో రైతన్నలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ధరలు పెరిగేలా అధికారులు, వ్యాపారులు ప్రత్యామ్నాయ చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

Similar News

News February 12, 2025

ఏపీలో పెట్టుబడులు పెట్టండి.. సిఫీకి లోకేశ్ ఆహ్వానం

image

AP: రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలని సిఫీ టెక్నాలజీస్ ఎండీ రాజు వేగేశ్నను మంత్రి నారా లోకేశ్ కోరారు. ఉండవల్లిలోని తన నివాసంలో రాజుతో మంత్రి భేటీ అయ్యారు. ఈ సందర్భంగా వైజాగ్‌లో మెగా డేటా సెంటర్, కేబుల్ ల్యాండింగ్ స్టేషన్ ఏర్పాటుపై చర్చించారు. ఏపీలో స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ గురించి వివరించారు. ఏపీలో పెట్టుబడికి తాము సుముఖంగా ఉన్నట్లు రాజు లోకేశ్‌కు తెలిపారు.

News February 12, 2025

కొత్తూరు జెపి దర్గాను సందర్శించిన హీరో విశ్వక్ సేన్

image

ఉమ్మడి పాలమూరు జిల్లా కొత్తూరు మండలంలోని జేపీ దర్గాను సినీ హీరో విశ్వక్ సేన్ సందర్శించారు. త్వరలో విడుదల కానున్న మూవీ ‘లైలా’ విజయవంతం కావాలని కుటుంబ సభ్యులతో కలిసి దర్గాని దర్శించి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. చిన్నతనం నుంచి ఈ దర్గాకు వస్తున్నట్లు చెప్పారు. ఈ మధ్య కాలంలో కొద్దిగా బిజీగా ఉండి రాలేకపోయానని ఇప్పుడు లైలా విడుదల సందర్భంగా వచ్చినట్లు చెప్పారు.

News February 12, 2025

రాష్ట్రస్థాయి పోటీల విజేతగా నిర్మల్ బిడ్డ

image

HYDలో నిర్వహిస్తున్న తెలంగాణ రాష్ట్ర ఓపెన్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ పోటీల్లో నిర్మల్ పట్టణానికి చెందిన అనుముల శ్రీవైభవి రాణించింది. అండర్ 13 విభాగంలో రాష్ట్రస్థాయి సింగిల్స్,  డబుల్స్‌లో విజేతగా నిలిచింది. మెడల్స్ సాధించిన శ్రీవైభవిని జిల్లా యువజన క్రీడల శాఖ అధికారి శ్రీకాంత్ రెడ్డి, ప్రిన్సిపల్ రాణి అభినందించారు.

error: Content is protected !!