News April 13, 2024

వరంగల్: ముగ్గురివి బీఆర్ఎస్ మూలాలే!

image

వరంగల్ పార్లమెంట్ స్థానానికి పోటీ చేస్తున్న మూడు ప్రధాన పార్టీల అభ్యర్థులు బీఆర్ఎస్ మూలాలు ఉన్న వారే. 2001 నుంచి బీఆర్ఎస్‌లో కొనసాగుతున్న మారేపల్లి సుధీర్ కుమార్‌ను అభ్యర్థిగా ఆ పార్టీ ప్రకటించింది. కాంగ్రెస్ అభ్యర్థి కడియం కావ్య గతంలో బీఆర్ఎస్‌లో పనిచేశారు. ఆ పార్టీ నుంచి టికెట్ కూడా దక్కింది. తర్వాత కాంగ్రెస్‌లో చేరారు. బీజేపీ అభ్యర్థి రమేశ్ 2 సార్లు బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు.

Similar News

News October 2, 2024

గీసుగొండ: బాలికపై వృద్ధుడి అత్యాచారం

image

గీసుగొండలో దారుణం చోటు చేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం.. ఓ గ్రామానికి చెందిన 12ఏళ్ల బాలికపై సాంబయ్య (65) అత్యాచారానికి పాల్పడ్డాడు. బాలిక తండ్రి చనిపోగా అన్నదమ్ములతో కలిసి ఉంటోంది. ఇంట్లో ఎవరూ లేని సమయంలో బాలికకు మాయమాటలు చెప్పి అత్యాచారం చేశాడు. ఈ విషయం తల్లికి చెప్పడంతో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. వైద్యులు పరీక్షించి 4నెలల గర్భవతిగా నిర్ధారించారు. సాంబయ్యపై పోక్సో చేసు నమోదైంది.

News October 2, 2024

WGL: నేడు ఎంగిలిపూల బతుకమ్మ

image

తెలంగాణ సంస్కృతికి అద్దం పట్టే ప్రకృతితో మమేకమయ్యే సంబరం బతుకమ్మ పండుగ. తొమ్మిది రోజులపాటు తొమ్మిది రకాల ప్రసాదాలను బతుకమ్మకు నివేదిస్తారు. బుధవారం ఎంగిలిపూల బతుకమ్మ అలంకరణ చేస్తారు. దీనికోసం రకరకాల పువ్వులు తీసుకొచ్చే బతుకమ్మగా పేరుస్తారు. ఈరోజు నువ్వులు, నూకలు లేదా బియ్యం, బెల్లంతో నైవేద్యం చేసి బతుకమ్మకు సమర్పిస్తారు.

News October 2, 2024

తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు బతుకమ్మ పండుగ చిహ్నం: మంత్రి

image

సుసంపన్నమైన తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు బతుకమ్మ పండుగ చిహ్నమని మంత్రి కొండా సురేఖ అన్నారు. నేడు మహాలయ అమావాస్య (పెత్ర అమావాస్య)ను పురస్కరించుకుని మంత్రి సురేఖ మహిళా లోకానికి, తెలంగాణ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ఎంగిలి పూల బతుకమ్మతో ప్రారంభమై, సద్దుల బతుకమ్మతో ముగిసే ఈ తొమ్మిది రోజుల పండుగతో తెలంగాణ పల్లెలు కొత్త కాంతులతో విరాజిల్లుతోందని మంత్రి అన్నారు.