News February 4, 2025
వరంగల్: రథ సప్తమి.. ఆలయాల్లో పోలీస్ బందోబస్తు
రథ సప్తమి పర్వదినాన్ని పురస్కరించుకొని వరంగల్ నగర పరిధిలోని ప్రధాన ఆలయాలతో పాటు వెంకటేశ్వస్వామి ఆలయాల్లో పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేయాలని సీపీ అంబర్ కిశోర్ ఝా పోలీస్ అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. ప్రధానంగా భక్తుల తాకిడి అధికంగా ఉండే ఆలయాల్లో మహిళా పోలీస్ సిబ్బందితో పాటు సీసీఎస్, షీ టీం పోలీసులు పరిసరాల్లో ముమ్మర పెట్రోలింగ్ చేపట్టాలని, ఆలయ ప్రాంతాల్లో ట్రాఫిక్‌పై దృష్టి సారించాలని సూచించారు.
Similar News
News February 4, 2025
వరంగల్: బాలికపై అత్యాచారం.. పోలీసులకు ఫిర్యాదు
వరంగల్ నగరంలో దారుణం జరిగింది. ఓ బాలికపై యువకుడు అత్యాచారం చేశాడు. వరంగల్ డివిజన్‌లో ఇంటర్ చదువుతున్న బాలిక(16)పై యువకుడు అత్యాచారం చేయడంతో ఏడు నెలల గర్భవతి అయింది. దీంతో బాలిక ఈ విషయాన్ని తల్లిదండ్రులకు తెలియజేసింది. బాలిక తల్లిదండ్రులు స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.
News February 4, 2025
నులి పురుగుల నివారణ కోసం శిక్షణ
జాతీయ నులి పురుగుల నివారణ కోసం వరంగల్ డీఎంహెచ్‌వో కార్యాలయంలో సిబ్బందికి శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డీఎంహెచ్ఓ సాంబశివరావు మాట్లాడుతూ.. ఫిబ్రవరి 10 నుంచి 17వ తేదీ వరకు ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. జిల్లాలోని 1,810 పాఠశాలు, కళాశాలలు, అంగన్వాడీ సెంటర్లలో 1,81,807 మంది విద్యార్థులకు అల్బెండజోల్ మాత్రలు పంపిణీ చేస్తామన్నారు.
News February 4, 2025
మేడారం మినీ జాతర.. RTC శుభవార్త
ములుగు జిల్లాలో జరిగే మినీ మేడారం, ఐలాపురం, కొండాయి జాతరలకు ఆర్టీసీ అధికారులు శుభవార్త చెప్పారు. ఈ నెల 9 నుంచి 16వ తేదీ వరకు మేడారానికి 100 బస్సులు, 400 ట్రిప్పులు నడపనున్నట్లు రీజినల్ మేనేజర్ విజయభాను తెలిపారు. ప్రతిరోజు ఉదయం 6 గంటల నుంచి బస్సులు ప్రారంభమవుతాయన్నారు. అమ్మవార్ల దర్శనానికి వెళ్లే భక్తులు ఈ అవకాశం సద్వినియోగం చేసుకోవాలన్నారు.