News April 21, 2024

వరంగల్: రెండు బైక్‌‌లు ఢీ.. ముగ్గురికి తీవ్ర గాయాలు

image

డోర్నకల్ మండల కేంద్రంలోని శివాలయం సమీపంలో రెండు బైక్‌లు ఢీకొన్నాయి. ప్రమాదంలో ముగ్గురికి తీవ్ర గాయాలు అయ్యాయి. ఒకరి పరిస్థితి విషమంగా ఉండటంలో 108 వాహనంలో ఏరియా హాస్పిటల్ తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటనకు సంబందించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Similar News

News January 5, 2025

నేడు వరంగల్‌లో డిప్యూటీ సీఎం పర్యటన

image

వరంగల్ జిల్లాలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆదివారం పర్యటించనున్నారు. మధ్యాహ్నం 1.45 గంటలకు వరంగల్‌కు చేరుకొని అధికారులతో సమావేశం కానున్నారు. వివిధ కార్యక్రమాల్లో పాల్గొన్న అనంతరం.. సాయంత్రం 4 గంటలకు గీసుగొండ మండలం మొగిలిచర్ల, విశ్వనాథపురం, గొర్రేకుంటలకు సంబంధించిన విద్యుత్ సబ్ స్టేషన్లకు శంకుస్థాపన చేస్తారు. మొగిలిచర్లలో జరిగే సభలో పాల్గొంటారు.

News January 5, 2025

వరంగల్: స్థానిక పోరుకు సన్నద్ధం..!

image

ఉమ్మడి వరంగల్ జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు అధికారులు ముమ్మరంగా ఏర్పాట్లు చేస్తున్నారు. ముందుగా పంచాయతీ ఎన్నికలా? ప్రాదేశిక ఎన్నికలా? అనే విషయంపై ప్రభుత్వం నుంచి స్పష్టత రావాల్సి ఉంది. కాగా ఇప్పటికే ఎన్నికల కమిషన్ నుంచి ఎన్నికల సామగ్రిని జిల్లాలకు పంపించే ప్రక్రియ ప్రారంభమైంది. మరోవైపు ప్రస్తుత రాజకీయ వాతావరణం దృష్ట్యా ఏ ఎన్నికలు ముందుగా వస్తాయనే విషయంపై గ్రామాల్లో చర్చ జరుగుతోంది.

News January 5, 2025

కొత్త వైరస్.. హనుమకొండ డీఎంహెచ్‌వో సూచన

image

చైనాలో కొత్త వైరస్ HMPV (హ్యూమన్ మెటా న్యూమో వైరస్) గురించి హనుమకొండ DMHO డా.అప్పయ్య పలు సూచనలు చేశారు. దీనిపై కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ పలు జాగ్రత్తలు సూచించిందన్నారు. వైరస్ శీతాకాలంలో చిన్నపిల్లలు, వృద్ధులలో సాధారణ చలి, జలుబు వంటి లక్షణాలను కలిగించే సాధారణ శ్వాస సంబంధిత వైరస్ అన్నారు. తెలంగాణలో HMPV కేసులపై ఎలాంటి సమాచారం లేదని, అయినప్పటికీ ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు.