News April 4, 2024
వరంగల్: రైలు కిందపడి ఆత్మహత్య

అనారోగ్యంతో ఓ యువకుడు రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు. జీఆర్పీ సీఐ కథనం ప్రకారం.. నెక్కొండ మండలం రెడ్డవాడకు చెందిన నవీన్(24) నాలుగు నెలలుగా గొంతునొప్పితో బాధపడుతూ.. MGMలో చికిత్స పొందుతున్నాడు. మెరుగైన వైద్యం కోసం HYDకి వెళ్లాలని వైద్యులు సూచించారు. భయాందోళనకు గురైన నవీన్ అదేరోజు రాత్రి జాన్‌పీరీలు గేట్ సమీపంలో పుష్‌పుల్ రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నట్లు తెలిపారు.
Similar News
News January 29, 2026
రేపు విద్యాసంస్థలకు సెలవు: కలెక్టర్

మేడారం మహాజాతరను పురస్కరించుకుని ఈ నెల 30 (శుక్రవారం) జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థలకు స్థానిక సెలవు ప్రకటిస్తూ కలెక్టర్ సత్య శారద ఉత్తర్వులు జారీ చేశారు. వనదేవతల దర్శనానికి వెళ్లే భక్తులు, సిబ్బంది సౌకర్యార్థం ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ సెలవుకు బదులుగా ఫిబ్రవరి 14వ తేదీని (రెండవ శనివారం) పనిదినంగా పరిగణించనున్నట్లు ఆమె స్పష్టం చేశారు.
News January 27, 2026
పుర ఎన్నికలకు సర్వం సిద్ధం: కలెక్టర్ సత్య శారద

వరంగల్ జిల్లాలో మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు అధికార యంత్రాంగం పూర్తిస్థాయిలో సిద్ధమైందని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ డాక్టర్ సత్య శారద స్పష్టం చేశారు. మంగళవారం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఆమె పాల్గొన్నారు. నర్సంపేటలోని 30 వార్డులు, వర్ధన్నపేటలోని 12 వార్డులకు ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారం ఏర్పాట్లు పూర్తి చేసినట్లు వివరించారు.
News January 26, 2026
మూడు రోజుల అనంతరం ఓపెన్ కానున్న వరంగల్ మార్కెట్

మూడు రోజుల విరామం అనంతరం వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్ మంగళవారం పున:ప్రారంభం కానుంది. శని, ఆదివారం వారాంతపు సెలవులు, సోమవారం గణతంత్ర దినోత్సవం సందర్భంగా మార్కెట్ బంద్ ఉంది. దీంతో రేపు ప్రారంభం కానుండగా.. రైతులు నాణ్యమైన సరుకులను మార్కెటుకు తీసుకొని వచ్చి మంచి ధర పొందాలని అధికారులు సూచించారు. కాగా ఉదయం 6 గంటల నుంచి మార్కెట్లో కొనుగోళ్లు ప్రారంభం కానున్నాయి.


