News September 19, 2024
వరంగల్ రైల్వే స్టేషన్లో బాటిల్ క్రషింగ్ మిషన్
వరంగల్ రైల్వే స్టేషన్ వద్ద ఉన్న ప్రయాణికులకు రైల్వే అధికారులు సింగల్ యూజ్ ప్లాస్టిక్‌పై అవగాహన కల్పించారు. సికింద్రాబాద్ రైల్వే డివిజన్ మేనేజర్ భర్తేష్ కుమార్ జైన్ ఆదేశాల మేరకు వరంగల్ రైల్వేస్టేషన్లో బాటిల్ క్రషింగ్ మిషన్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. వాటర్ బాటిల్స్ లాంటివి ఈ యంత్రంలో పడవేస్తే, తుక్కు తుక్కుగా మారుస్తుందని అధికారులు రైల్వే ప్రయాణికులకు తెలిపారు.
Similar News
News November 10, 2024
HNK: M.Sc కెమిస్ట్రీ తొమ్మిదో సెమిస్టర్ పరీక్ష టైం టేబుల్
కాకతీయ విశ్వవిద్యాలయ M.Sc (5 year integrated) కెమిస్ట్రీ తొమ్మిదో సెమిస్టర్ పరీక్ష టైం టేబుల్‌ను పరీక్షల నియంత్రణ అధికారి ఆచార్య ఎస్. నరసింహ చారి, అదనపు పరీక్షల నియంత్రణ అధికారిణి డాక్టర్ బీఎస్ఎల్ సౌజన్య ఓ ప్రకటనలో విడుదల చేశారు. మొదటి పేపర్ నవంబర్ 26న, రెండో పేపర్ 28న, మూడో పేపర్ 30న, నాల్గో పేపర్ డిసెంబర్ 3న మధ్యాహ్నం 2 గంటల నుంచి సా. 5 గంటల వరకు ఉంటాయని తెలిపారు.
News November 10, 2024
వరంగల్: గుండెపోటుతో యువకుడు మృతి
ఉమ్మడి వరంగల్ జిల్లాలో గుండెపోటుతో మరణిస్తున్న వారి సంఖ్య రోజురోజుకు పెరిగిపోతుంది. చిన్నాపెద్దా అని వయసుతో తేడా లేకుండా ప్రజలు హార్ట్ ఎటాక్‌కు గురై మృత్యువాత పడుతున్నారు. తాజాగా గ్రేటర్ వరంగల్ 19వ డివిజన్ పరిధిలోని కాశిబుగ్గకు చెందిన పల్లకొండ వినోద్ గత రాత్రి గుండెపోటుతో మరణించాడు. 30 సంవత్సరాలలోపు యువకుడే కావడంతో స్థానికంగా విషాదఛాయలు అలుముకున్నాయి.
News November 10, 2024
వరంగల్: వార్డు సభ్యుడిగా చేయాలన్నా పోటీనే!
కులగణన తర్వాత సర్పంచ్ ఎన్నికలు నిర్వహించనున్న సంగతి తెలిసిందే. 2,3 నెలలు సమయం పట్టే అవకాశముండగా గ్రామాల్లో అప్పుడే ఎన్నికల హీట్ కనిపిస్తోంది. పలు కారణాలతో గతంలో పోటీ చేయనివారు ఈసారి సై అంటున్నారు. సర్పంచ్ సంగతి పక్కన పెడితే వార్డు సభ్యుడిగా చేయాలన్నా కొన్ని చోట్ల పోటీ ఉంది. వార్డు సభ్యుడిగా గెలిచి ఉపసర్పంచ్ దక్కించుకోవాలని కొందరు ఉవ్విళ్లూరుతున్నారు. మరి మీ ప్రాంతంలో ఎలా ఉందో కామెంట్ చేయండి.