News April 3, 2025

వరంగల్: వ్యభిచార గృహంపై టాస్క్ ఫోర్స్ పోలీసుల దాడి

image

హనుమకొండ పోస్టల్ కాలనీలో హైటెక్ వ్యభిచారం చేస్తున్న ఇంటిపై సుబేదారి పోలీసులు, టాస్క్‌ఫోర్స్ పోలీసులు దాడులు నిర్వహించారు. ఇతర రాష్ట్రాలు నుంచి మహిళలను రప్పించి వ్యభిచారం చేస్తున్నారని పోలీసుల తెలిపారు. ఇందులో నలుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి 5 సెల్ ఫోన్స్, రూ.2,450 నగదు స్వాధీనపరచుకున్నామని ఏసీపీ మధుసూదన్ తెలిపారు.

Similar News

News April 4, 2025

బాసరలో వరంగల్ విద్యార్థి మృతి

image

నిర్మల్ జిల్లా బాసర వేద భారతి విద్యాలయంలో కరెంట్ షాక్‌తో విద్యార్థి మృతిచెందాడు. మృతుడు వరంగల్ జిల్లాకు చెందిన మణికంఠగా గుర్తించారు. ఇక్కడ గత కొద్ది రోజుల క్రితం అర్ధరాత్రి అనుమానాస్పద స్థితిలో దాడికి గురై విద్యార్థి ఆస్పత్రి పాలైన విషయం తెలిసిందే. ఈ ఘటన మరవకముందే మరో విద్యార్థి శుక్రవారం ఉదయం బోరు బటన్ వేయడానికి వెళ్లి కరెంట్ షాక్‌తో మృతిచెందటం ఆందోళనకరం. ఘటనపై బాసర పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

News April 4, 2025

వరంగల్- HYD పుష్-పుల్ ట్రైన్ నడపండి.. ఎంపీ కావ్య విజ్ఞప్తి

image

ఉదయం వేళ వరంగల్ నుంచి హైదరాబాద్‌కు పుష్-పుల్ రైలు నడపాలని శుక్రవారం వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య కోరారు. ఈమేరకు పార్లమెంట్‌లో రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్‌ను కలిసి విజ్ఞప్తి చేశారు.  ఆమె మాట్లాడుతూ.. పేద మధ్యతరగతి ప్రజలు రోజువారి పనుల నిమిత్తం హైదరాబాద్‌కు వెళ్తుంటారని, వారికి సౌకర్యార్థంగా రైళ్లను నడపాలని కోరారు. దీనిపై కేంద్ర మంత్రి సానుకూలంగా స్పందించినట్లు ఎంపీ తెలిపారు.

error: Content is protected !!