News February 25, 2025
వరంగల్: శైవ క్షేత్రాలకు నేటి నుంచి స్పెషల్ బస్సులు

మహా శివరాత్రి సందర్భంగా ప్రయాణికుల కోసం ఆర్టీసీ స్పెషల్ బస్సులను నడుపుతోంది. నేటి నుంచి ఈనెల 27వరకు ఉమ్మడి వరంగల్ జిల్లాలోని వరంగల్-1, వరంగల్-2, భూపాలపల్లి, జనగామ, మహబూబాబాద్, తొర్రూరు, పరకాల, హనుమకొండ డిపోల నుంచి 255 బస్సులను నడపనున్నారు. ఆయా డిపోల నుంచి కాళేశ్వరం, పాలకుర్తి, కురవి, కొమురవెల్లి, రామప్ప, మెట్టుగుట్టకు నడిపెంచేలా ఏర్పాట్లు చేశారు.
Similar News
News February 25, 2025
మహిళలకు శుభవార్త చెప్పిన ప్రభుత్వం

TG: నిరుద్యోగ మహిళలకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఉమెన్ కో ఆపరేటివ్ డెవలప్‌మెంట్ కార్పోరేషన్ ద్వారా ఉచితంగా ఈవీ ఆటో, టూ వీలర్ డ్రైవింగ్ శిక్షణ ఇవ్వనుంది. 18-45 ఏళ్ల మహిళలకు 45-60 రోజుల పాటు శిక్షణ అందించనున్నట్లు పేర్కొంది. డ్రైవింగ్ నేర్చుకున్న మహిళలకు సబ్సిడీపై ఈవీ ఆటోలు అందివ్వనున్నట్లు వెల్లడించింది. ఇప్పటివరకు 45 మందికి ట్రైనింగ్ ఇవ్వగా.. వచ్చే నెల 5 నుంచి కొత్త బ్యాచ్ స్టార్ట్ కానుంది.
News February 25, 2025
NZB: 96.78 శాతం పరీక్షలు రాసిన విద్యార్థులు

నిజామాబాద్ జిల్లాలోని తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకులాల్లో నిర్వహించిన ప్రవేశ పరీక్షల్లో 96.78 శాతం హాజరు నమోదైందని గురుకులాల ప్రవేశ పరీక్షల రీజనల్ కో ఆర్డినేటర్ తెలిపారు. నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా 20 సెంటర్లు ఏర్పాటు చేశారన్నారు. పరీక్షల కోసం 7,906 మంది విద్యార్థులు నమోదు చేసుకోగా, 7,651 మంది పరీక్షలు రాసినట్లు వెల్లడించారు. కాగా 255 మంది విద్యార్థులు గైర్హాజరైనట్లు పేర్కొన్నారు.
News February 25, 2025
విశాఖలో ఆర్డీవోకు చుక్కెదురు

విశాఖలోని ఓ దినపత్రికపై మీద ఎదురుదాడి చేసిన అధికార యంత్రాంగానికి హైకోర్టులో చుక్కెదురైంది. లీడర్ దినపత్రిక సంపాదకులు రమణ మూర్తికి ఆర్‌డీవో శ్రీలేఖ ఇచ్చిన నోటీసులను హైకోర్టు రద్దు చేసింది. ఈ మేరకు ఆదేశాలు జారీ చేసిన న్యాయమూర్తి నిమ్మగడ్డ వెంకటేశ్వర రావు అలాగే ఆర్‌డీవో ఇచ్చిన నోటిస్‌పై 3 వారాలులోగా పూర్తి వివరణ ఇవ్వాలని హైకోర్టు ఆదేశించింది.