News April 22, 2025
వరంగల్: సెకండ్ ఇయర్ లోనూ వారే ముందజ!

వరంగల్ జిల్లాలో ఇంటర్ సెకండియర్ ఫలితాల్లోనూ బాలికలదే పైచేయి. మొత్తం 4743మంది పరీక్షలు రాయగా 3292(69.41%) మంది పాసయ్యారు. బాలికలు మొత్తం 2877 మందికి గాను 2263(78%) ఉత్తీర్ణులయ్యారు. బాలురులో మొత్తం 1866 మంది విద్యార్థులకు గాను 1029మంది(55.14%) ఉత్తీర్ణులయ్యారు. అదేవిధంగా ఒకేషనల్‌లో బాలికలు 431 మంది విద్యార్థులకు గాను 347(80.51%) మంది.. బాలురు 227 మందికి 70(30.84%) మంది పాసయ్యారు.
Similar News
News December 14, 2025
రాంనగర్‌లో విషాదం: నాడు తండ్రి.. నేడు కుమారుడు!

హనుమకొండ జిల్లా ఐనవోలు మండలం రాంనగర్‌లో విషాదం అలుముకుంది. ఓటు హక్కు వినియోగించుకునేందుకు స్వగ్రామానికి వస్తూ వరుస సోదరులు బుర్ర కళ్యాణ్ (27), బుర్ర నవీన్ (27) రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. పదేళ్ల క్రితం తండ్రి ఉప్పలయ్య ప్రమాదంలో మరణించగా అప్పట్లో ప్రాణాలతో బయటపడ్డ నవీన్ ఇప్పుడు మృత్యువాత పడటంతో గ్రామం శోకసంద్రంగా మారింది. పెళ్లి ఏర్పాట్ల వేళ ఈ దుర్ఘటన కుటుంబాన్ని కంటతడి పెట్టించింది.
News December 14, 2025
HNK, వరంగల్ జిల్లాల్లో రసవత్తరంగా పంచాయతీ ఎన్నికలు

రెండో విడత పంచాయతీ ఎన్నికలు హనుమకొండ, వరంగల్ జిల్లాల్లో రసవత్తరంగా సాగనున్నాయి. పార్టీ గుర్తులు లేకున్నా, కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ మద్దతుదారులు బరిలో ఉన్నారు. మంత్రి కొండా సురేఖతో పాటు ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, కేఆర్ నాగరాజు, దొంతి మాధవరెడ్డి, రేవూరి ప్రకాశ్ రెడ్డిలకు ఈ ఎన్నికలు అగ్నిపరీక్షగా మారాయి. నేడు పోలింగ్ అనంతరం వచ్చే ఫలితాలు గ్రామీణ రాజకీయాలపై కీలక ప్రభావం చూపనున్నాయి.
News December 14, 2025
వరంగల్: ఆకట్టుకుంటున్న గ్రీన్ పోలింగ్ కేంద్రాలు

వరంగల్ కలెక్టర్ సత్య శారద చొరవతో గీసుకొండ, నల్లబెల్లి మండలాల్లో రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికల సందర్భంగా గ్రీన్ పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. పర్యావరణహితంగా తీర్చిదిద్దిన ఈ కేంద్రాల్లో పచ్చదనం, పరిశుభ్రతకు ప్రాధాన్యం ఇచ్చారు. ప్లాస్టిక్ రహిత అలంకరణ, మొక్కలు, పూలతో కేంద్రాలను ఆకర్షణీయంగా రూపొందించడంతో పాటు ఓటర్లకు సౌకర్యవంతమైన వాతావరణం కల్పించారు.


