News March 29, 2025
వరంగల్: సైనిక్ స్కూల్ విద్యార్థులకు అగ్నివీర్ ఉద్యోగాలు

వరంగల్ జిల్లా ఖానాపురం మండలం అశోక్ నగర్‌లోని సైనిక్ స్కూల్‌కు చెందిన 8 మంది డిగ్రీ విద్యార్థులు అగ్నివీర్(ఇండియన్ ఆర్మీ)లో ఉద్యోగాలు సాధించారు. పాఠశాలకు చెందిన ఈశ్వర్, ఆకాష్, అంజి, ఆనంద్, సాయికుమార్, రాజేందర్, అభిలాష్, శ్రావణ్ ఉద్యోగాలు సాధించిన వారిలో ఉన్నారు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు సాధించిన 8 మంది విద్యార్థులను పాఠశాల ప్రిన్సిపల్ సురేందర్ అభినందించారు.
Similar News
News April 2, 2025
నువ్వు దేవుడు సామీ.. వంటమనిషికి రూ.కోటి!

దివంగత పారిశ్రామిక దిగ్గజం రతన్ టాటా వీలునామా గురించి మరిన్ని విషయాలు వెలుగులోకి వచ్చాయి. తనకు ఎప్పటి నుంచో వండిపెడుతున్న కుక్ రజన్ షాకు రూ.కోటి ఇచ్చారు. ఇంటి పనులు చేసే సుబ్బయ్యకు రూ.66 లక్షలు, సెక్రటరీ డెల్నాజ్‌కు రూ.10 లక్షలు ఇవ్వాలన్నారు. తన ఎగ్జిక్యూటివ్ అసిస్టెంట్ శంతను నాయుడుకు ఉన్న రూ.కోటి రుణాన్ని మాఫీ చేశారు. రతన్ టాటాకు రూ.10వేల కోట్ల ఆస్తులుండగా, రూ.3800 కోట్లను దానధర్మాలకు ఇచ్చేశారు.
News April 2, 2025
రేషన్ కార్డు దారులకు గుడ్ న్యూస్

TG: రేషన్ షాపుల్లో సన్నబియ్యం అందిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం త్వరలోనే సరుకుల కిట్ ఇచ్చే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇందిరమ్మ అభయహస్తం పేరుతో ఈ పథకాన్ని అమలు చేయనుందని సమాచారం. గతంలో ‘అమ్మహస్తం’ పేరుతో కేజీ కందిపప్పు, లీటరు పామాయిల్, కిలో గోధుమపిండి, అరకిలో చక్కెర, కిలో ఉప్పు, అరకిలో చింతపండు, కారంపొడి, పసుపు, కిరోసిన్ అందజేసింది.
News April 2, 2025
14వేల ఎకరాల భూమి ఉన్నా ఈ వినాశనం ఎందుకు?: కేటీఆర్

TG: ఫ్యూచర్ సిటీకి భూమి అందుబాటులో ఉన్నా విలువైన పర్యావరణాన్ని వినాశనం చేయడం ఎందుకని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కేటీఆర్ Xలో ప్రశ్నించారు. ‘ఫ్యూచర్ సిటీ’లో ఐటీ పార్కులు, ఆర్థిక కార్యకలాపాల కోసం 14వేల ఎకరాల భూమి అందుబాటులో ఉందని పేర్కొన్నారు. భవిష్యత్తు తరాల కోసం ప్రస్తుత నగరాన్ని నాశనం చేస్తారా? అని ప్రశ్నించారు. హైదరాబాద్ జీవ వైవిధ్యాన్ని కాపాడాలని హాష్‌ట్యాగ్ ఇచ్చారు.