News March 1, 2025
వరంగల్‌కు ఎయిర్‌పోర్టు.. రివ్వున ఎగరనున్న విమానాలు

మామునూర్ ఎయిర్ పోర్టుకు కేంద్రం తాజాగా గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఓరుగల్లు ప్రజల ఏళ్లనాటి ఆకాంక్ష నెరవేరబోతోంది. ఇప్పటికే 696 ఎకరాల భూమిని సేకరించగా.. మరో 253 ఎకరాల భూమిని గుంటూరుపల్లి, నక్కలపల్లి, గాడిపల్లి గ్రామాల రైతుల నుంచి సేకరిస్తున్నారు. దీనికోసం రూ.205 కోట్లను ప్రభుత్వం మంజూరు చేసింది. అంతర్జాతీయ స్థాయిలో విమానాలు నడిపేందుకు ఇప్పుడున్న 1.8 కి.మీ రన్‌వేను 3.9కి.మీలకు పెంచాల్సి ఉంది. మీ కామెంట్
Similar News
News March 1, 2025
కర్నూలు జిల్లాలో 611 మంది విద్యార్థుల గైర్హాజరు

కర్నూలు జిల్లా వ్యాప్తంగా 69 పరీక్షా కేంద్రాల్లో ఇంటర్ ఫస్టియర్ విద్యార్థులకు పేపర్ 1 సెకండ్ లాంగ్వేజ్ పరీక్ష జరిగింది. ఈ పరీక్షకు 611 మంది విద్యార్థులు గైర్హాజరైనట్లు ప్రాంతీయ ఇంటర్మీడియట్ అధికారి గురువయ్య శెట్టి తెలిపారు. జిల్లా వ్యాప్తంగా 23,755 విద్యార్థులు హాజరు కావాల్సి ఉండగా 23,144 మంది విద్యార్థులు హాజరయ్యారు. ఎలాంటి మాల్ ప్రాక్టీస్ ఘటనలు చోటు చేసుకోలేదని ఆయన వివరించారు.
News March 1, 2025
జెలెన్‌స్కీ కోసం ట్రంప్‌ను ఎదిరించే సీన్ EUకు ఉందా?

పీస్‌డీల్ తిరస్కరించిన జెలెన్‌స్కీకి EU మద్దతు ప్రకటించింది. దానికి ట్రంప్‌ను ధిక్కరించే సీనుందా? అంటే కష్టమే అంటున్నారు విశ్లేషకులు. కూటమిలో సగం దేశాలకు యుద్ధమే ఇష్టం లేదు. గ్యాస్, ఆయిల్ కొరతతో ఇబ్బంది పడుతున్నాయి. జర్మనీలో కల్లోలం, ఫ్రాన్స్‌లో రాజకీయ సంక్షోభం నెలకొన్నాయి. UK పరిస్థితి దారుణం. NATO, UN నుంచి వైదొలగుతానన్న ట్రంప్ వేసే టారిఫ్స్‌ను వారు తట్టుకొనే స్థితిలో లేనే లేరన్నది అసలు నిజం.
News March 1, 2025
నీరాకేఫ్ గీత పారిశ్రామిక కార్పొరేషన్‌కు అప్పగిస్తాం: మంత్రి పొన్నం

నిరాకేఫ్ను పూర్తిస్థాయిలో గీతా పారిశ్రామిక కార్పొరేషన్కు అప్పగించడానికి నిర్ణయం తీసుకున్నామని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. శనివారం మినిస్టర్ క్వార్టర్స్‌లో గౌడ సంఘం నేతలు మాజీ ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, పల్లె లక్ష్మణరావు గౌడ్ ఇతర నాయకులు మంత్రిని కలిసి పలు అంశాలను దృష్టికి తెచ్చారు. నీరాకేష్, పాపన్న గౌడ్ విగ్రహం, గౌడ సంఘం భవన నిర్మాణం అంశాలు CM దృష్టికి తీసుకెళ్లినట్లు మంత్రి తెలిపారు.