News July 4, 2024

వరంగల్‌ను ఎడ్యుకేషన్ హబ్‌గా తీర్చిదిద్దుతాం: మంత్రి

image

హైదరాబాదుకు దీటుగా వరంగల్ నగరాన్ని తీర్చిదిద్దుతామని తెలంగాణ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. హన్మకొండలో ఈరోజు ఆయన పర్యటించి కొత్త ఐటీ కంపెనీని ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. వరంగల్‌ను ఎడ్యుకేషన్ హబ్‌గా తీర్చిదిద్దుతమని హామీ ఇచ్చారు. త్వరలోనే ప్రభుత్వ శాఖల్లో ఉన్న అన్ని ఖాళీల భర్తీకి కమిటీ ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు.

Similar News

News December 21, 2024

మున్సిపాలిటీలుగా కేసముద్రం, ఘన్‌పూర్.. మీ కామెంట్?

image

కేసముద్రం, స్టేషన్ ఘన్‌పూర్ మండలాలను మున్సిపాలిటీలు‌గా చేస్తున్నట్లు మంత్రి శ్రీధర్ బాబు ప్రకటించిన విషయం తెలిసిందే. కేసముద్రం పరిధిలో 40 గ్రామ పంచాయతీలు, స్టేషన్ ఘన్‌పూర్ మండల పరిధిలో 18 ఉన్నాయి. అయితే మున్సిపాలిటీ‌పై ప్రభుత్వం నుంచి స్పష్టమైన జీఓ విడుదల చేయాల్సి ఉంది. మరి ఎన్ని గ్రామాలు మున్సిపాలిటీలో కలుస్తాయి..? ఎన్ని గ్రామాలు GPలుగానే కొనసాగుతాయి? అనే విషయం తెలియాల్సి ఉంది. దీనిపై మీ కామెంట్.

News December 21, 2024

హనుమకొండ: ఎల్కతుర్తి ఎస్సై సస్పెండ్

image

హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి ఎస్సైగా విధులు నిర్వహిస్తున్న గోదారి రాజ్‌కుమార్‌ను సస్పెండ్ చేస్తూ వరంగల్ సీపీ అంబర్ కిషోర్ ఝా ఉత్తర్వులు జారీచేశారు. భూ వివాదంలో, సివిల్ విషయాల్లో జోక్యం చేసుకున్నందుకు ఉన్నతాధికారులకు ఫిర్యాదులు వెళ్లడంతో విచారణ జరిపి సస్పెండ్ చేసినట్లు పోలీస్ వర్గాల్లో చర్చ జరుగుతుంది. కాగా పోలీస్ స్టేషన్‌లో మరి కొంతమంది ఉద్యోగులపై నిఘా పెట్టినట్లు సమాచారం.

News December 21, 2024

కొమురవెల్లి కళ్యాణానికి సీపీకి ఆహ్వానం

image

కొమురవెల్లి దేవస్థాన అధికారులు సిద్దిపేట పోలీస్ కమిషనర్ డాక్టర్ బి.అనురాధను శుక్రవారం మర్యాదపూర్వకంగా కలిసారు. ఈ సందర్భంగా ఈనెల 29న జరిగే కొమురవెల్లి మల్లికార్జున స్వామి కల్యాణోత్సవానికి రావాలని వారికి కళ్యాణ ఆహ్వాన పత్రికను అందజేశారు. బాలాజీ శర్మ, బుద్ధి శ్రీనివాస్, సురేందర్ రెడ్డి, మహదేవుని మల్లికార్జున్, లక్ష్మి, శ్రీనివాస్, కొమురయ్య, మల్లికార్జున్, భాస్కర్, బసవేశ్వర్ తదితరులున్నారు.