News March 10, 2025
వరంగల్‌లో విధులు సంతృప్తినిచ్చాయి: అంబర్ కిషోర్ ఝా

వరంగల్ కమిషనరేట్‌లో సీపీగా పనిచేయడం సంతృప్తినిచ్చిందని బదిలీపై వెళ్తున్న పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా తెలిపారు. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వుల మేరకు రామగుండం పోలీస్ కమిషనరేట్‌కు బదిలీపై వెళ్తున్న అంబర్ కిషోర్ ఝాతోపాటు, సీఐడీ ఎస్పీగా బదిలీ అయిన ఈస్ట్‌జోన్ డీసీపీ రవీందర్‌ను కమిషనరేట్ పోలీస్ అధికారులు ఆదివారం ఘనంగా సత్కరించారు.
Similar News
News March 10, 2025
నల్గొండ: ఎమ్మెల్సీ అభ్యర్థులుగా నామినేషన్ దాఖలు

ఎమ్మెల్యే కోటాలో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థులుగా సోమవారం అద్దంకి దయాకర్, శంకర్ నాయక్ నామినేషన్ దాఖలు చేశారు. ఈ నామినేషన్ కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్, మంత్రులు కోమటిరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్యేలు, సీపీఐ నాయకులు పాల్గొన్నారు.
News March 10, 2025
పంత్‌ను కాదని KL వైపు గౌతీ మొగ్గు.. ఎందుకంటే!

CT 2025లో రిషభ్ పంత్‌ను కాదని KL రాహుల్‌ను కోచ్ గౌతమ్ గంభీర్ ఎంచుకోవడానికి కొన్ని రీజన్స్ ఉన్నాయి. ఇప్పటి వరకు వన్డేల్లో పంత్ తన X ఫ్యాక్టర్ నిరూపించుకోలేదు. స్పిన్ పిచ్‌లపై అంతగా ప్రభావం చూపలేదు. పైగా దుబాయ్ వంటి పిచ్‌లపై బౌలర్లు పెట్టే పరీక్ష ఎదుర్కోవాలంటే ఓపిక, మెరుగైన షాట్ సెలక్షన్, పరిణతి అవసరం. అతడిది ఇంపల్సివ్ నేచర్. తన వికెట్ విలువ తెలుసుకోకుండా ఔటైపోతారు. అందుకే KLవైపు గౌతీ మొగ్గారు.
News March 10, 2025
50-30-20 రూల్ పాటిస్తున్నారా?

సంపాదించిన డబ్బును ఎలా ఉపయోగించాలో తెలిసినవాడు గొప్పవాడు అని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. జీతంలో 50% ఇంటి అవసరాలు, హెల్త్ కేర్, రవాణా, పర్సనల్ కేర్, నిత్యావసర వస్తువుల కోసం ఖర్చు చేయాలి. మరో 30% షాపింగ్స్, ఔటింగ్స్ వంటి కోరికల కోసం ఉంచుకోండి. మిగతా 20శాతం మాత్రం పొదుపు చేయాలి. ప్రతి నెలా డబ్బును పొదుపు చేస్తూ భవిష్యత్తు కోసం పెట్టుబడులు ప్రారంభించండి. ఎమర్జెన్సీ ఫండ్ మెయింటేన్ చేయండి. SHARE IT