News September 20, 2024
వరద బాధితులకు నెల జీతం విరాళంగా ఇచ్చిన స్పీకర్
రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు విజయవాడ వరద బాధితులకు ఒక నెల జీతం విరాళంగా ప్రకటించారు. ఈ నేపథ్యంలో గురువారం చెక్కును సీఎం నారా చంద్రబాబు నాయుడుకు స్వయంగా అందజేశారు. ఈ సందర్భంగా స్పీకర్ మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరు తమ సామర్థ్యానికి తగ్గట్టు సీఎం రిలీఫ్ ఫండ్కు సహాయం అందించాలని కోరారు. వరద ప్రాంత బాధితులకు ఆ నిధులు ఎంతో ఉపయోగపడతాయన్నారు.
Similar News
News November 10, 2024
దీపం-2 పథకానికి అద్భుతమైన ప్రజాస్పందన: హోమంత్రి అనిత
దీపం-2 పథకానికి అద్భుతమైన ప్రజా స్పందన వస్తున్నట్లు రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత ‘ఎక్స్’లో పేర్కొన్నారు. సూపర్-6 హామీల్లో ఒకటిగా ఈ పథకాన్ని కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్నట్లు తెలిపారు. ఈనెల 7వ తేదీ సాయంత్రానికి 5,17,383 మంది లబ్ధిదారుల ఖాతాల్లో రూ.41.17 కోట్ల సబ్సిడీని ప్రభుత్వం జమ చేసినట్లు వివరించారు.
News November 9, 2024
ఉమ్మడి విశాఖ జిల్లాలో నామినేటడ్ పదవులు వీరికే..
ఉమ్మడి విశాఖ జిల్లాలో పలువురికి నామినేటెడ్ పదవులు వరించాయి. రాష్ట్ర గవర కార్పొరేషన్ ఛైర్మన్‌గా ఎం.సురేంద్ర, కొప్పల వెలమ ఛైర్మన్‌గా PVG కుమార్, రోడ్డు డెవలప్మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్‌గా నాగేశ్వరరావు, AP కో-ఆపరేటివ్ ఆయిల్ సీడ్స్ గ్రోవర్స్ ఫెడరేషన్ ఛైర్మన్‌గా జి.బాబ్జి, ఎన్టీఆర్ వైద్య సేవా ట్రస్ట్ ఛైర్మన్‌గా S.సుధాకర్, GCC ఛైర్మన్‌గా K. శ్రావణ్ కుమార్ VMRDA ఛైర్మన్‌గా ప్రణవ్ గోపాల్ నియమితులయ్యారు.
News November 9, 2024
అనకాపల్లి: గవర కార్పొరేషన్ చైర్మన్‌గా మళ్ళ సురేంద్ర
రాష్ట్ర గవర కార్పొరేషన్ ఛైర్మన్ గా అనకాపల్లికి చెందిన టీడీపీ నాయకుడు మళ్ల సురేంద్రను నియమిస్తూ ప్రభుత్వం శనివారం ఉత్తర్వులు జారీచేసింది. శనివారం కూటమి ప్రభుత్వం విడుదల చేసిన నామినేట్ పదవుల జాబితాలో సురేంద్రకు అవకాశం కల్పించారు. ఈ సందర్భంగా సురేంద్ర మాట్లాడుతూ.. తన పై నమ్మకంతో అవకాశం కల్పించిన చంద్రబాబు కు కృతజ్ఞతలు తెలిపారు.