News February 27, 2025

వర్గల్: వివాహేతర సంబంధంతో మహిళ హత్య

image

వర్గల్ మండలం అనంతగిరిపల్లి గ్రామానికి చెందిన ఓ మహిళ(40)తో అదే గ్రామానికి చెందిన బండ్ల చిన్న లక్ష్మయ్య మధ్య పరిచయం వివాహేతర సంబంధానికి దారితీసింది. ఈనెల 15న గజ్వేల్ పరిధిలోని కోమటిబండ అటవీ ప్రాంతంలోకి మహిళను తీసుకెళ్లి పురుగు మందు కలిపిన కల్లు తాగించాడు. ఆ తరువాత మెడకు చీరతో ఉరేసి చంపినట్లు గజ్వేల్ ఏసీపీ పురుషోత్తం రెడ్డి వివరాలను వెల్లడించారు. నిందితుడిపై కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు.

Similar News

News February 27, 2025

ఎస్.రాయవరం: తాటి చెట్టు నుంచి జారిపడి యువకుడి మృతి

image

ఎస్.రాయవరం మండలం పి.ధర్మవరంలో బుధవారం తాటి చెట్టు ఎక్కి ఆకులు కోస్తున్న యువకుడు ప్రమాదవశాత్తు చెట్టు పైనుంచి జారిపడి మృతి చెందినట్లు ఎస్ఐ విభీషణరావు తెలిపారు. పెనుగొల్లుకు చెందిన చిందాడ శ్రీను (27) కూలి పని కోసం తాటి చెట్టు ఆకులు కోసేందుకు వెళ్లాడు. చెట్టు ఎక్కి ఆకులు నరుకుతుండగా చెట్టుపై నుంచి ప్రమాదవశాత్తు జారి పడిపోయాడు. చికిత్స కోసం కేజీహెచ్‌కు తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందాడు.

News February 27, 2025

ఒంగోలు: హోంవర్క్ నెపంతో విద్యార్థికి వాత పెట్టిన టీచర్

image

ఒంగోలులోని గంటపాలెంలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఈ నెల 20న విద్యార్థి హోంవర్క్ చేయలేదన్న కారణంతో ఆగ్రహంతో ఊగిపోయిన సాబిదా అనే ట్యూషన్ టీచర్ అట్లకాడ కాల్చి పిరుదుల మీద విచక్షణారహితంగా వాతలు పెట్టింది. ఆ విద్యార్థికి కాల్చిన చోట పుండ్లు పడటంతో నొప్పి భరించలేక తల్లికి చెప్పడంతో టీచర్ నిర్వాకం వెలుగు చూసింది. ఇదేమిటి అని ప్రశ్నించినందుకు ఆమె భర్త చంపుతామని బెదిరించారు. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు.

News February 27, 2025

HYD: అయ్యో ఎంత పనిచేశారు సారూ..!

image

పండగపూట లంగర్‌హౌస్ చెరువులో <<15590306>>తండ్రీ కొడుకులు<<>> మృతిచెందిన విషయం తెలిసిందే. వారు చనిపోవడానికి ముందు జరిగిన పరిణామాలు స్థానికులు చెబుతుంటే కలవరపెడుతున్నాయి. కొడుకును భుజాన ఎత్తుకుని మునిగిపోతూ అధికారులు, సిబ్బందిని రక్షించమని వేడుకున్నా.. వారు స్పందించకుండా సాయం కావాలని స్థానిక నాయకులకు ఫోన్ చేసి అడిగారని ప్రత్యక్షసాక్షులు వాపోయారు. వారు సాయం అందించుంటే ఇద్దరూ బతికుండేవారని బాధిత కుటుంబం రోదించింది.

error: Content is protected !!