News March 29, 2025
వర్మగారూ మీ వైఖరి మార్చుకోండి: ముద్రగడ క్రాంతి

పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మకి పదవి రాకపోవడానికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కారణం కాదని ముద్రగడ పద్మనాభం కుమార్తె క్రాంతి ఎక్స్‌లో ట్వీట్ చేశారు. అది టీడీపీ సొంత వ్యవహారమని, మీరూ మీరు తేల్చుకోవాలి కానీ జనసేనపై అక్కసు వెళ్లగక్కడం ఎంతమంత్రం తగదని ఆమె హెచ్చరించారు. మీరు వైసీపీలోకి వెళతారని, ఆ పార్టీ వాళ్లతో టచ్‌లో ఉన్నారని వార్తలు వస్తున్నాయన్నారు. ‘వర్మ గారు మీరు తీరు మార్చుకోండి’ అని ఆమె తెలిపారు.
Similar News
News April 2, 2025
అల్లూరి: పాలీసెట్ పరీక్షకు ఉచిత శిక్షణ

రాష్ట్ర ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో ప్రవేశ పాలీసెట్-2025 పరీక్షకు ఉచిత శిక్షణ ఇస్తున్నట్లు అల్లూరి జిల్లా పాడేరు జిఎంఆర్ పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ కే.సుజాత మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఆసక్తిగల విద్యార్థులు తమ కార్యాలయంలో పేర్లు నమోదు చేసుకోవాలన్నారు. ఏప్రిల్ 2 నుంచి పాలీసెట్ కోచింగ్‌కు శిక్షణ ఇస్తున్నట్లు చెప్పారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.
News April 2, 2025
సత్యవేడు: పింఛన్ డబ్బుతో పరార్.. అధికారి సస్పెండ్

సత్యవేడు మండలంలోని కాలమనాయుడుపేట రైతు సేవా కేంద్రంలో పనిచేస్తున్న పశుసంవర్ధక శాఖ సహాయకుడు షేక్ సహిదుల్లాను సస్పెండ్ చేస్తూ తిరుపతి కలెక్టర్ వెంకటేశ్వర్ ఉత్తర్వులు జారీ చేశారు. విధులు పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించడం, రైతుల నుంచి అక్రమంగా నగదు వసూలు చేయడం, సామాజిక పింఛన్ల సొమ్ముతో పారిపోవడం తదితర కారణాలతో ఆయనపై చర్యలు తీసుకున్నారు. నగదు స్వాహపై పోలీసులకు అధికారులు ఫిర్యాదు చేశారు.
News April 2, 2025
నెల్లూరు: గురుకులాల ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం

నెల్లూరు జిల్లాలోని నెల్లూరు అక్కచెరువు పాడు, గండిపాళెం, తుమ్మల పెంట, ఆత్మకూరు గురుకుల పాఠశాలలో 2025 -26 సంవత్సరానికి గాను 5, 6, 7 ,8వ తరగతులలో ప్రవేశం పొందేందుకు అర్హులు ఆన్‌లైన్లో https://aprs.apcfss.in దరఖాస్తు చేసుకోవాలని గురుకులాల జిల్లా కన్వీనర్ జీ. మురళీకృష్ణ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈనెల ఆరో తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలని, 25న ప్రవేశ పరీక్ష ఉంటుందన్నారు. సద్వినియోగం చేసుకొవాలన్నారు.