News December 31, 2024
వర్రా రవీంద్రారెడ్డి కేసులో పోలీసుల స్పీడ్
YCP నేత వర్రా రవీంద్రారెడ్డి కేసులో పోలీసుల దూకుడు పెంచారు. గుంటూరుకు చెందిన పలువురిని పులివెందుల పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సేకరించిన వివరాల మేరకు.. కళ్ళం హరికృష్ణ రెడ్డి, ప్రేమ్ సాగర్, వెంకటరామిరెడ్డి లను అదుపులోకి తీసుకొని పులివెందుల తరలించారు. ఇప్పటికే ఈ కేసులో వర్రా రవీంద్రారెడ్డిని అరెస్టు చేయగా.. మొత్తం ఈ కేసుకు సంబంధించి 100 మందికి పైగా ఉన్నట్లు సమాచారం.
Similar News
News January 5, 2025
కమలాపురం: వికటించిన RMP డాక్టర్ వైద్యం?
ఓ RMP అందించిన వైద్యానికి సుబ్బరాయుడు అనే వ్యక్తి అపస్మారకస్థితిలోకి వెళ్లిన ఘటన కమలాపురంలో చోటుచేసుకుంది. బాధితుడి కుటుంబ సభ్యుల వివరాలు ప్రకారం.. ‘సుబ్బరాయుడు కాలికి గాయం కావడంతో కమలాపురం పట్టణం మార్కెట్లోని RMP వైద్యుని సంప్రదించారు. అతడు అందించిన చికిత్సలకు స్పృహ కోల్పోయాడు. రిమ్స్, ఓ ప్రైవేటు వైద్యశాలలో చికిత్సలు అందించగా.. మెరుగైన చికిత్సలు అవసరమని వైద్యులు తెలిపారు’ అని వాపోయారు.
News January 5, 2025
గండికోట, సిద్దవటం కోటలో షూటింగ్ చేయండి: పవన్ కళ్యాణ్
కడప జిల్లాలోని చారిత్రాత్మక గండికోట, సిద్దవటం కోటలలో సినీ చిత్ర పరిశ్రమ హీరోలు షూటింగ్ జరపాలని నిర్మాత దిల్ రాజును ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆకాంక్షించారు. రాజమండ్రి వేదికగా జరుగుతున్న రాంచరణ్ నటించిన గేమ్ ఛేంజర్ సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పలు కీలక వ్యాఖ్యలు చేశారు. సినీ పరిశ్రమను ఏపీకి తీసుకురావాలని కోరుకుంటూ జిల్లాలోని సిద్దవటం, గండికోటలో సినిమాలు తీయాలన్నారు.
News January 4, 2025
కడప: ‘ఉచిత ఇసుక పంపిణీ పక్కాగా అమలు చేయాలి’
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ఇసుక పంపిణీ విధానాన్ని పక్కాగా అమలు చేయాలని కడప జిల్లా కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి అధికారులను ఆదేశించారు. నూతన ఇసుక పాలసీ, ఇసుక బుకింగ్ ఇతర అంశాలపై గనులు భూగర్భ శాఖ కార్యదర్శి జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షా సమావేశం నిర్వహించారు. సీఎం చంద్రబాబు సూచనల మేరకు ఉచిత ఇసుక పాలసీని మరింత మెరుగుపరచాలని కలెక్టర్లను శుక్రవారం ఆదేశించారు.