News September 3, 2024
వర్షాల నష్టంపై నివేదికలు ఇవ్వండి: జిల్లా కలెక్టర్
తుఫాను కారణంగా జిల్లాలో కురిసిన భారీ వర్షాలతో ఎక్కడైనా ప్రభుత్వ, ప్రైవేటు ఆస్తులకు నష్టం వాటిల్లిన పంటనష్టం జరిగినా వెంటనే నివేధించాలని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ అధికారులను ఆదేశించారు. శ్రీకాకుళం కలెక్టరేట్ నుంచి ఆయన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పలు అంశాలపై ఆర్డీఓలు, తహశీల్దార్, ఎంపీడీఓలు, మున్సిపల్ కమిషనర్లతో మాట్లాడారు. మరో 2 రోజుల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అప్రమత్తంగా ఉండాలన్నారు.
Similar News
News November 26, 2024
మందస: ముగిసిన యుటీఎఫ్ స్వర్ణోత్సవ మహాసభలు
సామాజిక అంతరాలను రూపుమాపేదే విద్య అని యుటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు ఎన్.వెంకటేశ్వర్లు అన్నారు. మందస మండలం హరిపురంలో యూటీఎఫ్ స్వర్ణోత్సవ మహాసభలు సోమవారంతో ముగిశాయి. ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారం కోసమే కాకుండా, ప్రజలకు ఇబ్బంది వచ్చిన ప్రతి సందర్భంలోనూ వారిని ఆదుకోవడానికి యుటీఎఫ్ కార్యకర్తలు పని చేస్తారని తెలిపారు. అనంతరం నూతన కమిటీ ఎన్నికలు నిర్వహించారు. పలు తీర్మానాలు ప్రవేశపెట్టారు.
News November 25, 2024
SKLM: డిగ్రీ పరీక్ష ఫీజు చెల్లించేందుకు నేడే లాస్ట్
డాక్టర్ బి.ఆర్ అంబేడ్కర్ యూనివర్సిటీ డిగ్రీ 1వ సెమిస్టర్ పరీక్షలకు సంబంధించి పరీక్ష ఫీజు చెల్లించేందుకు గడువు సోమవారంతో ముగుస్తుంది. అభ్యర్థులకు ఈనెల 15వ తేదీ నుంచి పరీక్ష ఫీజు చెల్లించేందుకు అవకాశం ఇవ్వగా ఆ గడువు 25వ తేదీతో ముగుస్తుంది. రూ.500 అపరాధ రుసుముతో 27 వరకు, రూ.1500 అపరాధ రుసుముతో ఈనెల 28 వరకు అభ్యర్థులు పరీక్ష ఫీజు చెల్లించవచ్చు. డిసెంబర్ 12వ తేదీ నుంచి పరీక్షలు ప్రారంభంకానున్నాయి.
News November 25, 2024
సీతంపేట: విషాదం మిగిల్చిన వనభోజనం
సీతంపేట మండలం అడలి వ్యూ పాయింట్ వద్ద ఆదివారం వన భోజనానికి వెళ్లిన ఒక కుటుంబం తిరిగి వస్తుండగా ప్రమాదం చోటుచేసుకుంది. వారు వెళ్తున్న బైక్ అదుపు తప్పి లోయలో పడింది. బైక్ మీద ఉన్న దుప్పాడ భారతి(33) (విద్య కమిటీ ఛైర్మన్) మృతి చెందారు. భర్త దుర్గారావు, చిన్నారులు మేఘన, పల్లవికి తీవ్ర గాయాలయ్యాయి. వారిని పాలకొండ ప్రభుత్వాసుపత్రికి తరలించారు.