News May 2, 2024
వలేటివారిపాలెం: రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి

నల్గొండ జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో వలేటివారిపాలెం మండలం పోకూరుకి చెందిన జడ రవీంద్ర మృతి చెందాడు. గ్రామానికి చెందిన రవీంద్ర హైదరాబాదులోని ఓ కంపెనీకి చెందిన బస్సుకు డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. గురువారం మోటర్ బైక్ పైన హైదరాబాద్ నుంచి పోకూరు బయలుదేరిన రవీంద్ర చిట్యాల సమీపంలోకి రాగానే గుర్తుతెలియని వాహనం ఢీకొని అక్కడికక్కడే మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేసి బంధువులకు సమాచారం అందించారు.
Similar News
News April 23, 2025
వీరయ్య చౌదరి ఒంటిపై 53 కత్తిపోట్లు: CM

వీరయ్య చౌదరి లాంటి నేతను కోల్పోవడం చాలా బాధాకరమని సీఎం చంద్రబాబు అన్నారు. అమ్మనబ్రోలులో ఆయన మాట్లాడుతూ.. ‘నారా లోకేశ్, అమరావతి రైతుల పాదయాత్రలో వీరయ్య కీలకంగా ఉన్నారు. ఆయన మృతిని జీర్ణించుకోలేకపోతున్నా. వీరయ్య ఒంటిపై 53 కత్తిపోట్లు ఉన్నాయి. ఈ ఘటన వెనుక ఎవరున్నా వదిలిపెట్టను. ఎక్కడ దాక్కున్నా లాక్కొని వస్తా’ అని సీఎం హెచ్చరించారు.
News April 23, 2025
వీరయ్య చౌదరికి CM నివాళి

నాగులుప్పలపాడు మండలం అమ్మనబ్రోలులోని వీరయ్య చౌదరి నివాసానికి CM చంద్రబాబు చేరుకున్నారు. వీరయ్య మృతదేహానికి నివాళులు అర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించారు. ధైర్యంగా ఉండాలని సూచించారు. అన్ని విధాలుగా తాను అండగా ఉంటానని భరోసా కల్పించారు.
News April 23, 2025
అలకూరపాడు జడ్పీ హై స్కూల్ విద్యార్థినికి 595 మార్కులు

టంగుటూరు మండలంలోని అలకూరపాడు జిల్లా ఉన్నత పాఠశాల విద్యార్థిని పుట్ట వెంకట భార్గవి 10వ తరగతి ఫలితాల్లో సత్తా చాటింది. బుధవారం విడుదలైన 10వ తరగతి ఫలితాల్లో 600 గాను 595 మార్కులు సాధించి జిల్లా స్థాయిలో నిలిచింది. ఈ సందర్భంగా బాలికను పాఠశాల ఉపాధ్యాయులు, మండల విద్యశాఖధికారులు, గ్రామస్థులు అభినందనలు తెలిపారు.