News March 20, 2025
వల్మిడి శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయ హుండీ ఆదాయం ఎంతంటే?

పాలకుర్తి వల్మిడి శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయ హుండీ ఆదాయం రూ.49,108 వచ్చినట్లు ఈవో సల్వాది మోహన్ బాబు తెలిపారు. 2024 మే 17 నుంచి 2025 మార్చి 20 వరకు భక్తులు హుండీలో సమర్పించిన కానుకలు, 308 రోజుల ఆదాయాన్ని గురువారం ఆలయంలో దేవాదాయ ధర్మాదాయ శాఖ భువనగిరి ఇన్‌స్పెక్టర్ ఎం.వెంకటలక్ష్మి పర్యవేక్షణలో లెక్కించారు. ఈ హుండీ లెక్కింపు కార్యక్రమంలో ఆలయ సిబ్బంది, గ్రామస్థులు, తదితరులు పాల్గొన్నారు.
Similar News
News March 28, 2025
NZB: 62 మంది విద్యార్థుల గైర్హాజరు

పదో తరగతి వార్షిక పరీక్షల్లో భాగంగా శుక్రవారం జరిగిన ఫిజికల్ సైన్స్ పరీక్షకు జిల్లా వ్యాప్తంగా 62 మంది విద్యార్థులు గైర్హాజరైనట్లు జిల్లా విద్యాశాఖ అధికారి అశోక్ వెల్లడించారు. ఈ పరీక్షకు జిల్లా వ్యాప్తంగా 22,904 మంది విద్యార్థులకు అందులో నుంచి 22,842 మంది విద్యార్థులు హాజరయ్యారు. 62 మంది విద్యార్థులు గైర్హాజరైనట్లు అధికారికంగా వెల్లడించారు.
News March 28, 2025
47 మార్కెట్ కమిటీలకు ఛైర్మన్ల ప్రకటన

AP: రాష్ట్రంలో మూడో విడత నామినేటెడ్ పదవులను కూటమి ప్రభుత్వం భర్తీ చేసింది. 47 మార్కెట్ కమిటీలకు ఛైర్మన్‌లను ప్రకటించింది. ఇందులో 37 టీడీపీకి, 8 జనసేనకు, రెండు బీజేపీకి దక్కాయి. ఆ కమిటీల్లో 705 మంది సభ్యులను కూడా ప్రభుత్వం నియమించింది. త్వరలోనే మిగిలిన పదవులను భర్తీ చేస్తామని కూటమి అగ్ర నేతలు చెబుతున్నారు.
News March 28, 2025
రైల్వేబోర్డు చైర్మన్‌ను కలిసిన ఖమ్మం ఎంపీ

ఖమ్మం పార్లమెంట్ సభ్యులు రామసహాయం రఘురాం రెడ్డి రైల్వే బోర్డు ఛైర్మన్ సతీష్ కుమార్‌ను ఢిల్లీలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. డోర్నకల్- మిర్యాలగూడ, డోర్నకల్- గద్వాల రైల్వే లైన్ అలైన్మెంట్ గురించి వివరించారు. పలు సమస్యలు, సూచనలు తెలపగా రైల్వే బోర్డు ఛైర్మన్ సానుకూలంగా స్పందించారని తెలిపారు.