News February 12, 2025
వసతి గృహాల రిపేర్స్‌కు ప్రపోజల్స్ పంపండి: తిరుపతి కలెక్టర్
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1739351023890_52187236-normal-WIFI.webp)
జిల్లాలో ప్రభుత్వ వసతి గృహాలలో మరమ్మతుల నిమిత్తం ప్రపోజల్స్ పంపించాలని తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్. వెంకటేశ్వర్ అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్ నుంచి సాంఘిక సంక్షేమ, బీసీ సంక్షేమ, గిరిజన సంక్షేమ శాఖ అధికారులతో ఆయన టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు.
Similar News
News February 12, 2025
చెట్టుపై నుంచి జారిపడి వ్యక్తి మృతి
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1739368344317_51316327-normal-WIFI.webp)
కొమరాడ మండలంలో దేవుకోన గ్రామానికి చెందిన గిరిజనుడు కేలే నారాయణరావు(40) చెట్టుపై నుంచి జారిపడి మృతి చెందినట్లు ఎస్సై నీలకంఠం తెలిపారు. మంగళవారం ఉదయం మేకల మేత తీయుట కొరకు ఇంటి వెనుక ఉన్న చెట్టు ఎక్కి ప్రమాద వశాత్తూ పడిపోయాడు. తీవ్ర గాయాలు కావడంతో విశాఖ కేజీహెచ్ ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందినట్లు ఎస్ఐ తెలిపారు. మృతిని బంధువుల పిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నమన్నారు.
News February 12, 2025
23న జనసేన శాసనసభా పక్ష భేటీ
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1739373775626_81-normal-WIFI.webp)
AP: ఫిబ్రవరి 23న జనసేన పార్టీ శాసనసభా పక్ష సమావేశం నిర్వహించాలని ఆ పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ నిర్ణయించారు. మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో సాయంత్రం జరిగే ఈ భేటీలో పాల్గొనాలని ఎంపీలు, MLAలు, MLCలను పార్టీ ఆదేశించింది. 24వ తేదీన బడ్జెట్ సమావేశాలు పాల్గొననున్న నేపథ్యంలో ఈ భేటీకి ప్రాధాన్యం ఏర్పడింది.
News February 12, 2025
‘సంక్రాంతికి వస్తున్నాం’ బుల్లిరాజు తండ్రి పోలీస్ కంప్లైంట్
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1739361930288_1045-normal-WIFI.webp)
‘సంక్రాంతికి వస్తున్నాం’లో బుల్లి రాజు పాత్రతో బాలనటుడు రేవంత్ భీమాల అందర్నీ ఆకట్టుకున్నాడు. అతడి పేరిట కొన్ని ట్విటర్, ఇన్‌స్టా ఖాతాలు రాజకీయ విమర్శలు చేస్తుండటంతో అతడి తండ్రి శ్రీనివాసరావు పోలీసుల్ని ఆశ్రయించారు. ఆయా ఖాతాలపై చర్యలు తీసుకోవాలని కోరినట్లు ఆయన ఇన్‌స్టా పోస్ట్‌లో తెలిపారు. రేవంత్ భీమాల అన్న పేరిట ఉన్న ఇన్‌స్టా మాత్రమే తమదని, రేవంత్‌ను వివాదాల్లోకి లాగొద్దని విజ్ఞప్తి చేశారు.