News April 6, 2024

వస్తువుల విడుదలకు సులభతరం: కడప కలెక్టర్

image

సార్వత్రిక ఎన్నికల కోడ్ నేపథ్యంలో స్వాధీనం చేసుకున్న నగదు, వస్తువులను సులభంగా విడుదల చేసేందుకు జిల్లా స్థాయి అధికారులైన ముగ్గురు సభ్యులతో కూడిన సీజర్స్ పరిష్కార కమిటీని ఏర్పాటు చేయడం జరిగిందని కడప కలెక్టర్ విజయ్ రామరాజు ఒక ప్రకటనలో తెలిపారు. కలెక్టరేట్ లోని వీసీ హాలులో ప్రతిరోజూ ఉదయం 11 గంటలకు సీజర్స్ పరిష్కార కమిటీ సభ్యులు హాజరవుతారని, విచారించి త్వరితగతిన నగదు, వస్తువులు అప్పగిస్తారన్నారు.

Similar News

News February 6, 2025

రూ.80.15 కోట్ల లక్ష్యంతో స్వయం ఉపాధి: కలెక్టర్

image

జిల్లాలో వివిధ కార్పొరేషన్ల ద్వారా మొత్తం 4998 యూనిట్లకు రూ.80.15 కోట్ల లక్ష్యంతో స్వయం ఉపాధి అవకాశాలను అందించనున్నట్లు కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి పేర్కొన్నారు. బుధవారం కడప కలెక్టరేట్లో వివిధ కార్పొరేషన్ల జిల్లా అధికారులు, మున్సిపల్ కమిషనర్లు, ఎంపీడీఓలు స్వయం ఉపాధి, రుణ సహాయ సంక్షేమ పథకాల అమలుపై సమీక్షా సమావేశం నిర్వహించారు. స్వయం ఉపాధి అవకాశాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

News February 5, 2025

సింహాద్రిపురంలో పులి పిల్లలు?

image

కడప జిల్లా పులివెందుల నియోజకవర్గం సింహాద్రిపురం మండలంలోని బలపనూరు గ్రామంలో కలకలం రేగింది. మంగళవారం గ్రామంలో పులి పిల్లలు కనిపించాయని గ్రామస్థులు తెలిపారు. రెండు పులి పిల్లలు నెమళ్లను వేటాడుతూ కనిపించాయని గ్రామస్థుడు కిషోర్ అన్నారు. మరికొందరు కూడా పొదల్లో పులి పిల్లలు కనిపించాయని తెలిపారు. దీంతో గ్రామస్థులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు.

News February 5, 2025

కడపలో మహానాడు స్థలాన్ని పరిశీలించిన మంత్రి

image

మే లో కడప వేదికగా నిర్వహించే టీడీపీ మహానాడు ఏర్పాట్లను రాష్ట్ర మంత్రి సవిత జిల్లా నాయకులతో కలిసి పరిశీలించారు. జిల్లా టీడీపీ అధ్యక్షుడు శ్రీనివాసరెడ్డి, ఎమ్మెల్యే చైతన్యతో పాటు పలువురు నాయకులతో కలిసి మహానాడు నిర్వహించే స్థలాన్ని పరిశీలించి ఎంతమంది వస్తారు వారికి తగ్గ ఏర్పాట్ల చేసేలా చూడాలని మంత్రి నాయకులకు సూచించారు. ముఖ్యమంత్రితో పాటు రాష్ట్ర మంత్రులు, సీనియర్ నాయకులు, కార్యకర్తలు వస్తారన్నారు.

error: Content is protected !!