News April 1, 2025

వి.కోట : రోడ్డు ప్రమాదంలో టీచర్ మృతి 

image

వి.కోట – పలమనేరు ప్రధాన రహదారిలో రాఘవపల్లి వద్ద జరిగిన ప్రమాదంలో తీవ్రంగా గాయపడి వ్యక్తి మృతి చెందాడు. అతను రామకుప్పం మండలం కంచిదాసనపల్లెలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న గురుమూర్తిగా సమాచారం. మంగళవారం ఉదయం రాగువపల్లి వద్ద రోడ్డు ప్రమాదానికి గురవ్వగా.. స్థానికులు వి.కోట ప్రభుత్వ ఆసుపత్రి తరలించారు. అక్కడ మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. 

Similar News

News April 3, 2025

చిత్తూరు: తండ్రిని చంపిన కుమారుడు

image

తండ్రిని కుమారుడే హత్య చేసిన ఘటన చిత్తూరు జిల్లాలో గురువారం వెలుగు చూసింది. SRపురం మండలం ఆర్ఆర్ పురానికి చెందిన శ్రీనివాసులు మద్యానికి బానిసై తరచూ భార్యను వేధిస్తున్నాడు. కొన్ని సందర్భాల్లో తల్లిని కొట్టేవాడు. ఇదే విషయమై తండ్రితో కుమారుడు నాగరాజు గొడవ పడ్డాడు. ఈక్రమంలో తండ్రి తలపై గట్టిగా కొట్టడంతో ఆయన చనిపోయాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

News April 3, 2025

చిత్తూరు: నేటి నుంచి ప్రత్యేక ఆధార్ క్యాంపులు

image

చిత్తూరు జిల్లావ్యాప్తంగా ఈనెల 3వ తేదీ నుంచి 6వ తేదీ వరకు ఆధార్ స్పెషల్ క్యాంపులను నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు. ఆరేళ్ల లోపు పిల్లలకు, ప్రిమిటివ్ ట్రైబల్ గ్రూపులకు ఆధార్ నమోదు ప్రక్రియ చేపట్టనున్నట్లు చెప్పారు. ఎంపిక చేసిన గ్రామ, వార్డు సచివాలయాల్లో స్పెషల్ క్యాంపులు నిర్వహించేలా ఏర్పాట్లు చేశారు. ఈనెల 8వ తేదీ నుంచి 11వ తేదీ వరకు మరో విడత క్యాంపులు నిర్వహించనున్నారు.

News April 3, 2025

చిత్తూరు: నేటి నుంచి స్పాట్ వాల్యుయేషన్

image

చిత్తూరు జిల్లా కేంద్రంలోని పీసీఆర్ ప్రభుత్వ పాఠశాలలో గురువారం నుంచి టెన్త్ మూల్యాంకనం జరగనున్నట్లు డీఈవో వరలక్ష్మి తెలిపారు. 10వ తేదీ వరకు స్పాట్ వాల్యుయేషన్ కొనసాగుతుంది.  1,244 మంది టీచర్లకు ఈ బాధ్యత అప్పగించారు. ప్రతి టీచర్ తప్పనిసరిగా మూల్యాంకన విధులకు హాజరు కావాలన్నారు. పేపర్లు కరెక్షన్ చేసే సమయంలో సెల్‌ఫోన్ వాడరాదని స్పష్టం చేశారు.

error: Content is protected !!