News April 5, 2025
వికారాబాద్: 19 ప్రభుత్వ పాఠశాలల్లో AI తరగతులు

వికారాబాద్ జిల్లాలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ను పలు ప్రభుత్వ పాఠశాలల్లో అమలు చేస్తున్నారు. విద్యార్థుల్లో అభ్యసన సామర్థ్యాలను పెంపొందించడానికి జిల్లాలోని 19 ప్రభుత్వ పాఠశాలల్లో AI తరగతులను అందుబాటులోకి తెచ్చారు. విద్యార్థులు చదవడం, రాయడం సులభంగా నేర్చుకునేందుకు AI తరగతులు ఎంతగానో ఉపయోగపడతాయని ఉపాధ్యాయులు పేర్కొంటున్నారు. ఉపాధ్యాయులకు ప్రత్యేక శిక్షణ ఇచ్చేందుకు అధికారులు సిద్ధమయ్యారు.
Similar News
News April 6, 2025
తారక మంత్రం పఠిస్తే ప్రయోజనాలు ఎన్నో?

తారక మంత్రాన్ని మూడు సార్లు చదివితే విష్ణు సహస్రనామ పారాయణం చేసినంత పుణ్యం వస్తుందని పండితులు చెబుతున్నారు. ఈ మంత్రాన్ని జపించడం వల్ల ఒత్తిడి తగ్గడమే కాకుండా సహనం పెరుగుతుంది. సానుకూల దృక్పథం ఏర్పడుతుంది. రామ అనే పదం బ్రహ్మ, విష్ణు, మహేశ్వర రూపంగా పరిగణిస్తారు. తారక మంత్రం ఇదే..
‘శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే
సహస్రనామ తత్తుల్యం రామ నామ వరాననే’
News April 6, 2025
సోంపేట మండల యువకుడికి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం

ఇటీవల విడుదల అయిన SSC CGL ఫలితాల్లో సోంపేట మండలం బారువకొత్తూరులోని మత్స్యకార కుటుంబానికి చెందిన గురుమూర్తి సత్తా చాటారు. ఆల్ ఇండియా స్థాయిలో 374వ ర్యాంక్ సాధించి కేంద్రం ప్రభుత్వంలో ఉద్యోగం సాధించారు. కస్టమ్స్ విభాగంలో ఇన్‌స్పెక్టర్‌గా పోస్టింగ్ వచ్చినట్లు సన్నిహితులు తెలిపారు. దీంతో అతని తల్లిదండ్రులు శకుంతల, మోహనరావు ఆనందం వ్యక్తం చేశారు. అతనికి గ్రామస్థులు అభినందనలు తెలిపారు.
News April 6, 2025
నెల్లూరు: బస్ స్టాండ్‌లలో రద్దీ

నేడు(ఆదివారం) శ్రీరామనవమి సందర్భంగా నెల్లూరు జిల్లా వ్యాప్తంగా పలు RTC బస్ స్టాండ్‌లలో రద్దీ ఏర్పడింది. బస్సులు ప్రయాణికులతో కిక్కిరిసిపోయాయి. దూర ప్రాంతాల్లో వ్యాపారులు, ఉద్యోగులు పండుగకు స్వగ్రామాలకు పయనం కావడంతో ఈ పరిస్థితి నెలకొంది. బస్ స్టాండ్‌లలో ఆకతాయిలు, జేబు దొంగల పట్ల ప్రయాణికులు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు హెచ్చరిస్తున్నారు.