News February 24, 2025
వికారాబాద్: 93ఎకరాల భూమి.. 62మందికి చెక్కులు

పారిశ్రామిక పార్కులో భూములను కేటాయించిన రైతులకు నష్టపరిహార చెక్కులను అందించామని జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ తెలిపారు. శుక్రవారం కలెక్టరేట్లో కొడంగల్ నియోజకవర్గం దుద్యాల మండలం హకీంపేటకు సంబంధించిన రైతులకు నష్ట పరిహార చెక్కులను తాండూర్ సబ్ కలెక్టర్ ఉమా శంకర్ ప్రసాద్‌తో కలిసి జిల్లా కలెక్టర్ అందజేశారు. 93.16 ఎకరాల భూమికి 62 మంది రైతులకు నష్టపరిహారం అందించామన్నారు.
Similar News
News February 25, 2025
చరిత్రలో ఈరోజు (ఫిబ్రవరి 25)

* 1961- తెలుగు రచయిత శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి మరణం
* 1974- సినీ నటి దివ్యభారతి జననం(ఫొటోలో)
* 1981- బాలీవుడ్ నటుడు షాహిద్ కపూర్ పుట్టినరోజు
* 1998- ఫోన్ చేస్తే వార్తలు చెప్పే విధానాన్ని ఆల్ ఇండియా రేడియో(ఆకాశవాణి) ప్రవేశపెట్టింది
* 2004- సినీ నిర్మాత, దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత బి.నాగిరెడ్డి మరణం
* 2010- స్వాతంత్ర్య సమరయోధుడు కాటం లక్ష్మీనారాయణ మరణం
News February 25, 2025
సత్తుపల్లిలో GOVT స్కూల్ ఫ్లెక్సీ అదుర్స్

మనం చాలా చోట్ల కార్పొరేట్ స్కూళ్లకు చెందిన ఫ్లెక్సీలు, నేమ్ బోర్డులు చూస్తుంటాం.. కానీ అందర్నీ ఆశ్చర్యపరుస్తూ ప్రైవేట్ పాఠశాలలకు ధీటుగా తమ విద్యార్థులు ప్రభంజనం సృష్టించారంటూ ఉపాధ్యాయులు ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. సత్తుపల్లి పట్టణంలోని ఎన్టీఆర్ నగర్ ప్రాథమిక పాఠశాల విద్యార్థులు చదువులో రాణించడంతోపాటు ఏ పోటీల్లో పాల్గొన్నా బహుమతి కచ్చితమంటూ ఫ్లెక్సీ ద్వారా ఆ టీచర్లు ప్రచారం చేస్తున్నారు.
News February 25, 2025
నిజామాబాద్: విషాదం.. చెరువులో పడి బాలుడి మృతి

చెరువులో పడి ఓ బాలుడు మృతిచెందిన ఘటన నిజామాబాద్ జిల్లా ధర్పల్లి మండలంలో జరిగింది. స్థానికులు తెలిపిన వివరాలు.. ధర్పల్లి మండలం దుబ్బాక గ్రామానికి చెందిన తండ్రీకొడుకులు పశువులను మేపేందుకు తీసుకెళ్లారు. పశువులు చెరువులోకి దిగి పైకి రాకపోవడంతో తండ్రీకొడుకులు వాటిని పైకి వచ్చేలా చేస్తుండగా ప్రమాదవశాత్తు కుమారుడు బాదావత్ చిన్న (16) నీట మునిగి చనిపోయాడు. పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.