News February 1, 2025

వికారాబాద్: అడవిలో ఉద్దేశపూర్వకంగా నిప్పు పెడితే చర్యలు

image

అటవీ ప్రాంతంలో ఉద్దేశపూర్వకంగా ఎవరైనా నిప్పు పెడితే కఠిన చర్యలు తప్పవని అటవీ శాఖ రేంజర్ అధికారి రాజేందర్ హెచ్చరించారు.శుక్రవారం అర్ధరాత్రి యాలాల్ మండలం రాస్నం-అంపల్లి మార్గంలో గల అటవీ ప్రాంతంలో గుర్తుతెలియని వ్యక్తులు నిప్పు పెట్టారు. సెక్షన్ అధికారి కనకరాజు తన సిబ్బందితో వెళ్లి మంటలు ఆర్పారు. అటవీ ప్రాంతంలో మంటలు చెలరేగితే అటవీ భూములు సాగు చేస్తున్న రైతులే బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు.

Similar News

News February 1, 2025

ముస్తాబాద్: గూడు లేక.. రాత్రంతా అంబులెన్సులోనే మృతదేహం

image

ముస్తాబాద్‌కి చెందిన బిట్ల సంతోష్ (48) అనే నేత కార్మికుడు అనారోగ్యంతో శుక్రవారం రాత్రి మృతి చెందాడు. సొంతిల్లు లేకపోవడంతో మృతదేహాన్ని అంబులెన్స్ లోనే ఉంచి భార్య శారద ముగ్గురు పిల్లలతో రాత్రంతా చలిలో ఉన్నారు. ప్రభుత్వం వారి కుటుంబాన్ని ఆదుకోవాలని గ్రామస్థులు అభ్యర్థించారు.

News February 1, 2025

AP పట్ల కేంద్రానికి ఇంతటి నిర్లక్ష్యమెందుకు?: జైరామ్ రమేశ్

image

కేంద్ర ప్రభుత్వం బిహార్‌కు బొనాంజా ప్రకటించి కూటమిలోనే భాగమైన ఆంధ్రప్రదేశ్‌ను మాత్రం అత్యంత క్రూరంగా నిర్లక్ష్యం చేసిందని కాంగ్రెస్ అధికార ప్రతినిధి జైరామ్ రమేశ్ ట్విటర్లో విమర్శించారు. ‘త్వరలో ఎన్నికలున్నాయి కాబట్టి బిహార్‌కు కేంద్రం వరాలు కురిపించింది. అది సహజమే. కానీ ఎన్డీయేకు మూలస్తంభంలా ఉన్న ఆంధ్రప్రదేశ్‌ను ఎందుకంత క్రూరంగా నిర్లక్ష్యం చేసింది?’ అని ప్రశ్నించారు.

News February 1, 2025

అనకాపల్లి: ఎన్నికలు ముగిసేవరకు పరిష్కార వేదిక నిలుపుదల

image

ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రక్రియ ముగిసే వరకు ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని నిలుపు చేస్తున్నట్లు అనకాపల్లి జిల్లా కలెక్టర్ విజయకృష్ణన్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలో ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిందన్నారు. మార్చి 8వ తేదీతో ఎన్నికల కోడ్ ముగుస్తుందన్నారు. ఆ తర్వాత నుంచి ప్రజావేదిక కొనసాగిస్తామని ప్రజలు గమనించాలని కోరారు.