News February 7, 2025
వికారాబాద్: అప్పుడే మండుతున్న ఎండలు
గత కొన్నిరోజులుగా వికారాబాద్ జిల్లాలో అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. నిన్న జిల్లాలో 35.2 డిగ్రీలు నమోదైంది. ఫిబ్రవరి మొదటి వారంలోనే పగటిపూట ఉష్ణోగ్రతలు సాధారణం కన్నా ఎక్కువగా రికార్డు అవుతున్నాయి. ఇప్పుడే ఇలా ఉంటే.. మునుముందు పరిస్థితి ఎలా ఉంటుందో అని జనం ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.పొద్దున, సాయంత్రం వాతావరణం చల్లగా ఉన్నప్పటికీ పగటి పుట ఉష్ణోగ్రతలు సుర్రుమంటున్నాయి.
Similar News
News February 7, 2025
కుంభాభిషేకం ముగింపు కార్యక్రమానికి ఏర్పాట్లు చేయాలి: కలెక్టర్
కాళేశ్వర ముక్తేశ్వర స్వామి దేవాలయంలో మహా కుంభాభిషేక మహోత్సవాలు రంగ రంగ వైభవంగా ప్రారంభమైనట్లు జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ తెలిపారు. కాళేశ్వర దేవస్థానంలో శుక్రవారం జిల్లా కలెక్టర్, కాటారం సబ్ కలెక్టర్ మయాంక్ సింగ్ పర్యటించారు. ఈనెల 9న మహా కుంభాభిషేకం ముగింపు కార్యక్రమానికి భక్తులు పెద్ద సంఖ్యలో వచ్చే అవకాశం ఉందని రద్దీకి తగినట్లు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు.
News February 7, 2025
దారుణం.. రైల్లోంచి గర్భిణిని నెట్టేసిన దుండగుడు
తిరుపతి-కోయంబత్తూరు మధ్య ప్రయాణించే ఇంటర్‌సిటీ ఎక్స్‌ప్రెస్ రైలులో దారుణం చోటుచేసుకుంది. ఓ దుండగుడు గర్భిణిని లైంగిక వేధింపులకు గురిచేసి, రైల్లోంచి కిందకి నెట్టివేశాడు. ఈ ఘటన కేవీ కుప్పం రైల్వేస్టేషన్ సమీపంలో జరిగింది. రక్తపుమడుగులో పడి ఉన్న మహిళను జోలార్‌పేట పోలీసులు గుర్తించి ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనకు పాల్పడిన వేలూరు కేవీ కుప్పంకు చెందిన హేమరాజ్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు.
News February 7, 2025
మహాకుంభమేళా @40 కోట్ల మంది భక్తులు
ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న మహాకుంభమేళాకు వెళ్లే భక్తుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. నేటి వరకు 40 కోట్ల మందికి పైగా త్రివేణీ సంగమం వద్ద పుణ్యస్నానాలు చేసినట్లు యూపీ ప్రభుత్వం ప్రకటించింది. జనవరి 13న ప్రారంభమైన మహాకుంభమేళా ఫిబ్రవరి 26 వరకు కొనసాగనుంది. ఇవాళ కుంభమేళాలో మరోసారి అగ్నిప్రమాదం సంభవించింది. సెక్టార్-18 శంకరాచార్య మార్గంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.