News January 28, 2025
వికారాబాద్ జిల్లా ఉత్తమ ఎంపీడీవోగా మహేశ్ బాబు

వికారాబాద్ జిల్లా ఉత్తమ ఎంపీడీవోగా దోమ మండలం ఎంపీడీవోగా విధులు నిర్వహిస్తున్న మహేశ్ బాబుకు ఉత్తమ అవార్డు లభించింది. వికారాబాద్ జిల్లా కలెక్టర్ ప్రతిక్ జైన్ చేతుల మీదగా ప్రశంసా పత్రాన్ని అందుకున్నారు. ఈ సందర్భంగా ఎంపీడీవో మాట్లాడుతూ.. అంకితభావంతో విధులు నిర్వహించడం, సేవా దృక్పథం, ఉద్యోగుల సహకారం వల్లే తనకు అవార్డు లభించిందని అన్నారు. అవార్డు మరింత బాధ్యత పెంచిందని తెలిపారు.
Similar News
News March 15, 2025
HYD: మారనున్న యూనివర్సిటీ పేరు.. హిస్టరీ ఇదే!

నాంపల్లిలోని పొట్టి శ్రీరాములు యూనివర్సిటీ పేరు మార్పుపై నేడు సభలో బిల్లును ప్రవేశపెట్టనున్నట్లు తెలుస్తోంది. వర్సిటీకి సురవరం ప్రతాపరెడ్డి పేరు పెట్టనున్నట్లు సమాచారం. కాగా సరిగ్గా నలభై ఏళ్ల క్రితం 1985లో తెలుగు యూనివర్సిటీని NTR ప్రారంభించారు. దీనికే 1998లో పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీగా నామకరణం చేశారు.
News March 15, 2025
NZB: మోసాలకు గురవుతున్న వినియోగదారుడు!

మార్కెట్ ఏదైనా మోసాలకు గురవుతున్నది మాత్రం వినియోగదారుడే. తనకు జరిగిన అన్యాయాన్ని వినియోగదారుల ఫోరంలో ఫిర్యాదులు చేయకపోవడం వల్ల వ్యాపారుల అక్రమాలకు గురవుతున్నారు. న్యాయం చేయడానికి వినియోగదారుల ఫోరం కోర్టులు ఉన్నా ప్రజల అవగాహన లేమితో వినియోగించుకుంటోంది తక్కువే. నేడు ప్రపంచ వినియోగదారుల హక్కుల దినోత్సవం. వినియోగదారుల హక్కులను తెలుసుకొని వ్యాపారుల మోసాలకు అడ్డుకట్ట వేయండి.
News March 15, 2025
ఇబ్రహంపట్నంలో దారుణ హత్య.. నిందితులు అరెస్ట్

ఇబ్రహంపట్నం ఫెర్రీలో శనివారం యువకుడు దారుణ హత్య ఘటన చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. హతుడు కంచికచర్ల చెందిన వ్యక్తిగా అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం విజయవాడ GGHకు తరలించారు. నిందితులను అదుపులోకి తీసునన్నమన్నారు. ఈ ఘటనపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.