News March 10, 2025

వికారాబాద్ జిల్లా నేటి ముఖ్యాంశాలు

image

✓ VKB: ప్రజావాణికి వచ్చే సమస్యలను సత్వరమే పరిష్కరించాలి: కలెక్టర్
✓ VKB: జిల్లావ్యాప్తంగా 116 మంది విద్యార్థులు ఇంటర్ పరీక్షలకు గైర్హాజరు
✓ పరిగి: ఇందిరమ్మ కమిటీల ద్వారానే ఇళ్ల పంపిణీ: MLA
✓ పరిగి: ఘనంగా లక్ష్మీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు
✓ కొడంగల్: వీరభద్రేశ్వర స్వామి విగ్రహ పున:ప్రతిష్ఠాపన కార్యక్రమం
✓ తాండూర్: జిల్లాలో సావిత్రిబాయిఫూలే వర్ధంతి 
✓ బొంరాస్‌పేట: ఇసుక డంపులు సీజ్

Similar News

News March 11, 2025

సంగారెడ్డి: ఇద్దరు ఉపాధ్యాయులు సస్పెండ్

image

8 మంది విద్యార్థులను అకారణంగా కొట్టినందుకు కంగ్టి కస్తూర్బా పాఠశాల నుంచి ఇద్దరిని విధుల నుంచి తొలగిస్తు జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. గణితం సీఆర్పీ సురేఖ, పీఈటీ రేణుకను విధుల నుంచి తొలగించినట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. విద్యార్థులను కొడితే కఠినంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

News March 11, 2025

సంగారెడ్డి: పోలీసు అధికారులను హెచ్చరించిన ఎస్పీ

image

జిల్లాలో పోలీసు అధికారులు అంకితభావంతో పనిచేయాలని నూతన ఎస్పీ పారితోష్ పంకజ్ అన్నారు. జిల్లా ఎస్పీ కార్యాలయంలో పోలీసు అధికారులతో సోమవారం సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. పోలీస్ స్టేషన్లలో పెండింగ్ కేసులు ఉంటే వెంటనే పరిష్కరించేలా చూడాలని చెప్పారు. విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటానని హెచ్చరించారు. సమావేశంలో అదనపు ఎస్పీ సంజీవరావు పాల్గొన్నారు.

News March 11, 2025

కామారెడ్డి: ఆయిల్ ఫాం సాగుకు రూ.50,918 రాయితీ

image

వంట నూనెల ఉత్పత్తిలో స్వయం సమృద్ధి సాధించే దిశగా.. NMEO-OP పథకం కింద ఆయిల్ ఫాం సాగుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సహిస్తుందని కామారెడ్డి జిల్లా ఉద్యాన, పట్టు పరిశ్రమ అధికారి జ్యోతి అన్నారు. ఆయిల్ ఫాం సాగు ప్రోత్సహించడానికి ఎకరానికి రూ.50,918 వరకు రాయితీ ఇస్తున్నట్లు పేర్కొన్నారు. ఇందుకు సంబంధించిన కరపత్రాలను జిల్లా కార్యాలయంలో కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ ఆవిష్కరించారు.

error: Content is protected !!