News March 16, 2025
వికారాబాద్ జిల్లా నేటి ముఖ్యాంశాలు

✓VKB:ప్రజా సమస్యల పరిష్కారానికి పోరుబాట:జాన్ వెస్లీ.✓VKB: జిల్లావ్యాప్తంగా ఇంటర్ పరీక్షలకు 117 మంది గైర్హాజరు.✓VKB:అభివృద్ధికి సహకరిస్తున్న రైతులను అభినందించిన కలెక్టర్ ప్రతిక్ జైన్.✓TDR:త్రాగునీటి కోసం కాళీ బిందెలతో మహిళల నిరసన.✓VKB:ఈనెల 26న వాహనాల బహిరంగ వేలం పాట:ఎస్పి.✓ కుల్కచర్ల:పాంబండ రామలింగేశ్వరస్వామి బ్రహ్మోత్సవాల వాల్పోస్టర్ ఆవిష్కరణ.✓ జిల్లాలో ఘనంగా కాన్సిరాం జయంతి కార్యక్రమాలు.
Similar News
News March 16, 2025
మాజీ MLA రాజయ్య హౌస్ అరెస్ట్

సీఎం రేవంత్ రెడ్డి స్టేషన్ ఘనపూర్ పర్యటన సందర్భంగా మాజీ MLA తాటికొండ రాజయ్యను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. వారి నివాసం వద్ద పోలీసులు భారీగా మోహరించారు. కాగా, జిల్లా వ్యాప్తంగా పలు పార్టీల నేతలను పోలీసులు ముందస్తు అరెస్టు చేశారు. రాజయ్య మాట్లాడుతూ.. ప్రజాపాలన పేరుతో కాంగ్రెస్ సామాన్య ప్రజలను మోసం చేస్తుందని విమర్శించారు. దమ్ముంటే అక్రమ అరెస్టులు చేయకుండా జిల్లాలో పర్యటించాలన్నారు.
News March 16, 2025
తిరుపతిలో నేటి చికెన్ ధరలు ఇవే

తిరుపతి జిల్లాలోని పలు ప్రాంతాలలో ఆదివారం చికెన్ ధరలు ఈ విధంగా ఉన్నాయి. చికెన్ ధర స్కిన్‌తో రూ.180 నుంచి రూ.200 వరకు అమ్ముతున్నారు. అలాగే స్కిన్ లెస్ రూ.200 నుంచి రూ.220 వరకు పలుకుతోంది. లేయర్ చికెన్ ధర రూ.110 నుంచి రూ.120 ఉన్నట్లు వ్యాపారులు తెలిపారు. ఆదివారం అయినప్పటికీ వ్యాపారాలు అంతంత మాత్రంగానే ఉన్నాయని వ్యాపారులు వాపోయారు.
News March 16, 2025
ఖానాపూర్: బస్సును ఢీ కొట్టిన ఆటో.. తర్వాత ఏమైందంటే?

WGL జిల్లా ఖానాపూర్ మండలం పాకాల చెరువు సమీపంలో నర్సంపేట నుంచి కొత్తగూడ వెళ్తున్న RTC బస్సును చిలుకమ్మ నగర్ వైపు నుంచి నర్సంపేటకు వస్తున్న ఆటో ఢీకొట్టింది. దీంతో ఒక వ్యక్తికి గాయాలయ్యాయి. ప్రమాదం జరిగిన వెంటనే బస్సు డ్రైవర్, కండక్టర్ కిందికి దిగి చూడగా ఆటోలో అడవి పంది మాంసం, చనిపోయిన కొండ గొర్రెను చూశారు. భయపడిన ఆటోలోని నలుగురు వ్యక్తులు కొండగొర్రెను అక్కడే వదిలేసి అటోతో సహా పరారయ్యారు.