News February 24, 2025
వికారాబాద్ జిల్లాలో” SUNDAY TOP NEWS”

√ తాండూరు: భద్రేశ్వర స్వామి ఆలయంలో శివపార్వతుల కల్యాణం. బొంరాస్‌పేట:Way2News కథనానికి స్పందన.√ మహా కుంభమేళాకు హాజరైన పరిగి మాజీ ఎమ్మెల్యే.√ వికారాబాద్ జిల్లా వ్యాప్తంగా దంచి కొడుతున్న ఎండలు.√ బ్లడ్ ఫ్లూ ఎఫెక్ట్ తో జిల్లాలో పెరిగిన ఎఫెక్ట్ పెద్దెముల్: అభివృద్ధి పనులు ప్రారంభించిన ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి.√ వికారాబాద్ జిల్లాలో ప్రశాంతంగా ముగిసిన గురుకుల ప్రవేశ పరీక్ష.
Similar News
News December 19, 2025
రాజంపేటలో CM హామీ ఇచ్చిన చోటే..!

రాజంపేటను అన్నమయ్య జిల్లా కేంద్రంగా చేస్తామని హామీ ఇచ్చిన చోటే శుక్రవారం ప్రజాగర్జన నిర్వహించడానికి జేఏసీ రంగం సిద్ధం చేసింది. జిల్లా కేంద్రం విషయంలో రాజంపేటకు అన్యాయం జరిగిందని, తాము న్యాయం చేస్తామని ఎన్నికల సమయంలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ హామీ ఇచ్చారు. అదే ప్రాంతంలో నిర్వహించనున్న గర్జన సభకు కోడూరు, రాజంపేట నియోజకవర్గాల నుంచి భారీ ఎత్తున ప్రజలు, నేతలు తరలి రానున్నారు.
News December 19, 2025
నాగర్‌కర్నూల్ జిల్లా అటవీశాఖ అధికారిగా రేవంత్ చంద్ర

నాగర్‌కర్నూల్ జిల్లా అటవీశాఖ అధికారి (డీఎఫ్‌ఓ)గా రేవంత్ చంద్ర శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. ఇక్కడ పనిచేసిన రోహిత్ గోపిడి రంగారెడ్డి జిల్లాకు బదిలీ కావడంతో ఆయన స్థానంలో రేవంత్ నియమితులయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జిల్లాలో అడవుల సంరక్షణతో పాటు వన్యప్రాణుల రక్షణకు ప్రత్యేక ప్రాధాన్యమిస్తానని, బాధ్యతయుతంగా విధులను నిర్వహిస్తానని పేర్కొన్నారు.
News December 19, 2025
రాష్ట్ర చరిత్రలో భారీ లొంగుబాటు

తెలంగాణలో తొలిసారిగా 35 మంది మావోలు ఒకేసారి లొంగిపోయారు. వీరిలో హిడ్మా బెటాలియన్ కమాండర్ ఎర్రోళ్ల రవి, ADB నస్పూర్ దళ కమాండర్స్ ఉన్నారు. వారి నుంచి AK 47, SLR గన్స్ సహా భారీగా ఆయుధాలు స్వాధీనం చేసుకున్నారు. DGP శివధర్ రెడ్డి మధ్యాహ్నం ప్రెస్‌మీట్‌లో వివరాలు వెల్లడించే అవకాశముంది.
– నిన్న సుకుమా జిల్లాలో ముగ్గురు మావోయిస్టుల ఎన్‌కౌంటర్‌తో 2024-25లో ఛత్తీస్‌గఢ్‌లో చనిపోయిన వారి సంఖ్య 503కు చేరింది.


