News February 25, 2025
వికారాబాద్: ‘పది’ పరీక్షలకు పకడ్బందీ చర్యలు: కలెక్టర్

జిల్లాలో పదవ తరగతి పరీక్షలను నిర్వహించేందుకు అధికారులు పకడ్బందీ చర్యలు చేపట్టాలని వికారాబాద్ జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ అధికారులను ఆదేశించారు. మంగళవారం వికారాబాద్ జిల్లా కలెక్టరేట్లో పదవ తరగతి పరీక్షల నిర్వహణపై అధికారులతో కలెక్టర్ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో పదవ తరగతి పరీక్షలకు 12,903 మంది విద్యార్థులు హాజరుకానున్నట్లు తెలిపారు.
Similar News
News February 26, 2025
విశాఖ రైల్వే స్టేషన్‌లో DRM ఆకస్మిక తనిఖీ

వాల్తేరు DRM లలిత్ బోహ్రా మంగళవారం మొదటి సారిగా విశాఖ రైల్వే స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. స్టేషన్‌లో పరిశుభ్రత, కోచ్ నిర్వహణ సమస్యలు, రద్దీ, భద్రతకు సంబంధించిన పలు విషయాలను అడిగి తెలుసుకున్నారు. జనరల్ బుకింగ్ ఆఫీస్, ఫుట్ ఓవర్ బ్రిడ్జిలు, క్యాటరింగ్ స్టాల్స్ మొదలైన వాటిని పరిశీలించారు. స్టేషన్‌లో పురోగతిలో ఉన్న పనులను సీనియర్ అధికారులతో సమీక్షించారు.
News February 26, 2025
పౌర సరఫరాల జిల్లా మేనేజర్‌గా అంబదాస్ రాజేశ్వర్

సంగారెడ్డి జిల్లా పౌర సరఫరాల మేనేజర్‌గా అంబదాస్ రాజేశ్వర్ మంగళవారం బాధ్యతలు చేపట్టారు. నిజామాబాద్ జిల్లా మేనేజర్‌గా పనిచేస్తున్న ఆయన బదిలీపై సంగారెడ్డికి వచ్చారు. గతంలో ఆయన నారాయణఖేడ్ రెవెన్యూ డివిజనల్ మొదటి అధికారిగా పనిచేశారు. ఇకనుంచి సంగారెడ్డి పౌర సరఫరాల మేనేజర్‌గా పూర్తి బాధ్యతలు వహించనున్నారు.
News February 26, 2025
చికెన్ లెగ్‌పీస్ తిన్న బాపట్ల జిల్లా కలెక్టర్

బర్డ్ ఫ్లూ నేపథ్యంలో బాపట్ల జిల్లా వ్యాప్తంగా చికెన్ తినేందుకు ప్రజలు ఇప్పటికీ జంకుతున్నారు. చికెన్‌పై అపోహలు వద్దని చికెన్ తినొచ్చని అనేక చోట్ల అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నప్పటికీ ప్రజల్లో ఒకింత భయం నెలకొంది. ఈ నేపథ్యంలో బాపట్ల జిల్లా కలెక్టర్ ఒక అడుగు ముందుకేసి ప్రజల భయం పోగొట్టేలా చికెన్‌తో తయారు చేసిన ఆహారం తింటూ కనిపించారు. దీంతో ఇకనైనా ప్రజలు భయాన్ని వీడి చికెన్ తినాలని ఆకాంక్షించారు.