News April 4, 2025

వికారాబాద్‌: పెద్దేముల్‌ హత్యకు గురైన యశోద వివరాలు

image

వికారాబాద్ జిల్లాలో సంచలనంగా మారిన ఓ మహిళ హత్య కేసులో పోలీసులు పురోగతి సాధించారు. ఈ నెల 2వ తేదీన పెద్దేముల్ మండల కేంద్రంలో గుర్తు తెలియని మహిళ మృతదేహం లభ్యమైన విషయం తెలిసిందే. కాగా, ఆ మహిళ ఎవరు అనేది నిర్ధారించినట్లు ఎస్ఐ శ్రీధర్ రెడ్డి శుక్రవారం తెలిపారు. బొంరాస్‌పేట మండలంలోని చౌదర్‌పల్లి గ్రామానికి చెందిన ఈర్లపల్లి యశోదగా గుర్తించారు. హత్యకు గల పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Similar News

News April 16, 2025

ADB: నాలుగు రోజుల్లో పరీక్షలు.. చదువుకున్నారా..?

image

ఓపెన్ స్కూల్ సొసైటీ ద్వారా జిల్లాలో నిర్వహించనున్న పదో తరగతి, ఇంటర్మీడియట్ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని డీఈఓ శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. ADBలోని డీఈఓ ఆఫీస్‌లో పరీక్ష నిర్వాహణ అధికారులతో మంగళవారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. పదో తరగతి పరీక్షలకు 518 మంది, ఇంటర్మీడియట్ పరీక్షకు 395 మంది అభ్యాసకులు హాజరవుతారన్నారు. ఈనెల 20 నుంచి 26వ తేదీ వరకు పరీక్షలు కొనసాగుతాయని తెలిపారు.

News April 16, 2025

ADB: బెల్ట్ షాపుపై దాడులు.. కేసు నమోదు: CI

image

ఆదిలాబాద్ టూ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని వడ్డెర కాలనీలో నిర్వహిస్తున్న బెల్ట్ షాపుపై మంగళవారం పోలీసులు దాడి చేశారు. ఈ సందర్భంగా దుకాణంలో రూ. 2,200 విలువైన మూడు లీటర్ల అక్రమ మద్యం స్వాధీనం చేసుకున్నట్లు సీఐ కరుణాకర్ రావు తెలిపారు. ఈ మేరకు బెల్ట్ షాప్ నిర్వహిస్తున్న రాజుపై కేసు నమోదు చేసినట్లు పేర్కొన్నారు. బెల్ట్ షాపులు నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

News April 16, 2025

నెన్నెల: 9 మంది నేరస్థుల బైండోవర్

image

నెన్నెల పోలీస్ స్టేషన్ పరిధిలోని పలువురు నేరస్థులను మంగళవారం నెన్నెల తహశీల్దార్ ఎదుట పోలీసులు బైండోవర్ చేశారు. పేకాట కేసులో ఐదుగురు, గంజాయి కేసులో మరో నలుగురు నిందితులను బైండోవర్ చేసినట్లు ఎస్సై ప్రసాద్ తెలిపారు. నేరస్తులు తమ ప్రవృత్తిని మార్చుకోవాలని సూచించారు. ముందు మంచి ప్రవర్తనతో ఉండాలన్నారు. మళ్లీ ఇలాంటి చర్యలకు పాల్పడితే ఉపేక్షించేది లేదని హెచ్చరించారు.

error: Content is protected !!