News April 7, 2025
వికారాబాద్: ప్రజావాణి ద్వారా సమస్యల పరిష్కారం: కలెక్టర్

ప్రజా సమస్యల పరిష్కారం కోసం ప్రజావాణిలో ఫిర్యాదులు స్వీకరిస్తున్నట్లు కలెక్టర్ ప్రతీక్ జైన్ తెలిపారు. కలెక్టరేట్‌లోని సమావేశం మందిరంలో అదనపు కలెక్టర్లు లింగయ్య నాయక్, సుదీర్‌లతో కలిసి ఫిర్యాదులు స్వీకరించారు. భూ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఈ సమావేశంలో డీపీఓ జయసుధ, డీఆర్డీఓ శ్రీనివాస్, డీఓ రేణుకాదేవి, సాంఘీక సంక్షేమ అధికారి మల్లేశం, తదితరులు పాల్గొన్నారు.
Similar News
News April 8, 2025
HNK: ఆర్టీసీ బస్సు బోల్తా.. 15 మందికి గాయాలు

హనుమకొండ జిల్లా హసన్‌పర్తి మండలం చింతగట్టు రింగ్ రోడ్డు బ్రిడ్జి వద్ద మంగళవారం తెల్లవారుజామున ఆర్టీసీ బస్సు ప్రమాదవశాత్తు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 15 మంది ప్రయాణికులకు తీవ్ర గాయాలయ్యాయి. ఒంగోలు నుంచి ఆదిలాబాద్‌కు వెళ్లే లహరి ఎక్స్‌ప్రెస్ బస్సుగా గుర్తించారు. గాయాలైన వారిని చికిత్స కోసం 108 ద్వారా వరంగల్ ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
News April 8, 2025
HNK: ఆర్టీసీ బస్సు బోల్తా.. 15 మందికి గాయాలు

హనుమకొండ జిల్లా హసన్‌పర్తి మండలం చింతగట్టు రింగ్ రోడ్డు బ్రిడ్జి వద్ద తెల్లవారుజామున ఆర్టీసీ బస్సు ప్రమాదవశాత్తు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 15 మంది ప్రయాణికులకు తీవ్ర గాయాలయ్యాయి. ఒంగోలు నుంచి ఆదిలాబాద్‌కు వెళ్లే లహరి ఎక్స్‌ప్రెస్ బస్సుగా గుర్తించారు. గాయాలైన వారిని చికిత్స కోసం 108 ద్వారా వరంగల్ ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
News April 8, 2025
మద్యం మత్తులో హత్య: సీఐ

రావికమతం మండలం గర్ణికంలోని ఆదివారం రాత్రి పవన్ కుమార్ <<16017545>>హత్యకు<<>> గురైన విషయం తెలిసిందే. యువకుడి హత్యకు స్నేహితుల మధ్య మద్యం మత్తులో తలెత్తిన వివాదం కారణం కావొచ్చని సర్కిల్ ఇన్స్పెక్టర్ జి.కోటేశ్వరరావు తెలిపారు. అతనితో కలిసి మద్యం తాగిన స్నేహితుల వివరాలు, హత్యకు దారి తీసిన వివాదంపై స్పష్టత రావాల్సి ఉందన్నారు. పవన్‌కు గతంలో నేర చరిత్ర ఉందన్నారు.