News March 19, 2025
వికారాబాద్: బీజేపీలో అంతర్గత కుమ్ములాట

ఊహించని విధంగా వికారాబాద్ జిల్లా బీజేపీ అధ్యక్షునిగా స్థానికేతరుడైన డాక్టర్ కొప్పుల రాజశేఖర్ రెడ్డిని నియమించడంతో వికారాబాద్ జిల్లా బీజేపీ సీనియర్ నాయకులు ఆగ్రహంగా ఉన్నారు. నామినేషన్ తిరస్కరించాలని సంబంధిత పరిశీలకునికి వినతి పత్రం సమర్పించిన రోజే జిల్లా అధ్యక్షునిగా డాక్టర్ రాజశేఖర్ రెడ్డిని నియమించడం పట్ల వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నేడు హైదరాబాద్‌కు వెళ్లనున్నారు.
Similar News
News March 19, 2025
పశువుల షెడ్డులో 12 అడుగుల గిరినాగు..!

మాడుగులలో బుధవారం 12 అడుగుల భయంకరమైన గిరినాగు హల్ చల్ చేసింది. మాడుగుల మోదమాంబ కాలనీలో కనక అనే మహిళ ఈ గిరినాగును తన పశువుల షెడ్డులో చూసి భయాందోళన చెంది కుమారుడు గణేశ్‌కు విషయం చెప్పింది. దీంతో గణేశ్ స్నేక్ క్యాచర్ వెంకటేశ్‌కు సమాచారం ఇవ్వడంతో చాకచక్యంగా ఈ గిరి నాగును బంధించారు. ఈ గిరినాగును వంట్లమామిడి సమీపంలో ఉన్న అటవీ ప్రాంతంలో విడిచిపెడతామని స్నేక్ క్యాచర్ వెంకటేశ్ తెలిపారు.
News March 19, 2025
HYDలో అచ్చంపేట యువకుడి ఆత్మహత్య

నాగర్‌కర్నూల్ జిల్లా అచ్చంపేట మండలం చేదురుబావి తండాకు చెందిన మూడవత్ బాలు నాయక్ హైదరాబాద్‌లో ఆత్మహత్యకు పాల్పడ్డాడని స్థానికులు తెలిపారు. బతుకుదెరువు కోసం కొన్నేళ్లుగా హైదరాబాద్‌లో ఉంటూ జీవనం సాగిస్తున్నాడన్నారు. ఆర్థిక ఇబ్బందులు, దానికి తోడు కుటుంబ కలహాలతో బాలు నాయక్ ఈరోజు ఆత్మహత్యకు పాల్పడ్డాడని చెప్పారు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. దీంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
News March 19, 2025
వంజంగి అమ్మాయికి గేట్‌లో 25వ ర్యాంక్

ఆమదాలవలస మండలం వంజంగి గ్రామానికి చెందిన పైడి పూజిత నేడు విడుదలైన గేట్-2025 ఫలితాలలో ఆల్ ఇండియా 25 ర్యాంకు సాధించారు. పూజిత నాగపూర్‌లోని వీఎన్ఐటీ యూనివర్సిటీలో ఇంజినీరింగ్ ఫైనల్ ఇయర్ చదువుతున్నారు. పూజిత తండ్రి పైడి శ్రీనివాసరావు ఎల్.ఎన్.పేట ఎంపీడీవోగా పనిచేస్తున్నారు. పూజిత తల్లి ఆదిలక్ష్మి గృహిణి. గేట్‌లో వంద మార్కులకు గాను 73 మార్కులు సాధించినట్లు తండ్రి శ్రీనివాస రావు తెలిపారు.