News February 19, 2025
వికారాబాద్‌లో రోడ్డు ప్రమాదం.. ఒకరి మృతి

వికారాబాద్‌లో మంగళవారం రాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. స్థానికుల వివరాలు.. RTO ఆఫీస్ వద్ద ఆటో, కారు ఒకదానికొకటి ఢీ కొన్నాయి. ఈ ప్రమాదంలో కారులో ఉన్న ఒకరు తీవ్రగాయాలతో అక్కడికక్కడే మృతి చెందారు. వికారాబాద్ పోలీసులు దర్యాప్తు చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Similar News
News March 15, 2025
శుభ ముహూర్తం (15-03-2025)

☛ తిథి: బహుళ పాడ్యమి మ.12.59 వరకు
☛ నక్షత్రం: ఉత్తర ఉ.7.43 తదుపరి హస్త
☛ శుభ సమయం: ఉ.11.56 నుండి 12.32 వరకు
☛ రాహుకాలం: మ.9.00-10.30 వరకు
☛ యమగండం: మ.1.30-3.00 వరకు
☛1.దుర్ముహూర్తం: .ఉ.6.00-7.36 వరకు
☛ వర్జ్యం: సా.4.57నుండి6.42 వరకు
☛ అమృత ఘడియలు: లేదు
News March 15, 2025
బాపట్ల జిల్లా కలెక్టర్ సూచనలు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న స్వచ్ఛాంధ్ర స్వచ్ఛత దివాస్ కార్యక్రమం శనివారం సూర్యలంక బీచ్‌లో జరగనుంది. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ జె. వెంకట మురళి పాల్గొంటున్నట్లు కలెక్టర్ కార్యాలయ ప్రతినిధులు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉన్నతాధికారులు, అధికారులు పాల్గొంటున్నట్లు తెలిపారు.
News March 15, 2025
విజయవాడ: ప్రభాస్ ఫ్యాన్స్‌కు అదిరిపోయే న్యూస్

ఈ నెల 21వ తేదీన రెబల్ స్టార్ ప్రభాస్, శృతిహాసన్ నటించిన సలార్ చిత్రాన్ని విజయవాడలో రీ రిలీజ్ చేయనున్నారు. ఈ చిత్రం విజయవాడలోని 8 థియేటర్లలో రీ రిలీజ్ అవ్వనున్నట్లు తెలుస్తోంది. దీంతో ప్రభాస్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో సందడి చేస్తున్నారు. కాగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రంలోని యాక్షన్ సీన్లు సినీ అభిమానులను ఉర్రూతలూగించాయి.