News April 19, 2024

విజయనగరం జిల్లాలో తుపాకులు స్వాధీనం

image

ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ఈసీ నిబంధనల ప్రకారం పోలీసులు అప్రమత్తమయ్యారు. తుపాకీ లైసెన్స్‌లు కలిగిని వారందరూ ఎన్నికల ప్రక్రియ ముగిసేవరకూ తమ ఆయుధాలను అందజేయాలంటూ పోలీసులు వారికి లేఖలు రాశారు. ఈమేరకు సంబంధిత వ్యక్తులు తుపాకులను పోలీసులకు అప్పగించారు. జిల్లాలో ఎస్బీఎల్, డీబీబీఎల్, ఫిస్టల్, రైఫిల్స్ మొత్తం 445 ఉన్నాయి. 68 మినహా మిగతా అన్ని పోలీసు శాఖ స్వాధీనం చేసుకుంది.

Similar News

News November 30, 2024

హోం మంత్రి ఆధ్వర్యంలో సమీక్ష: కలెక్టర్

image

జిల్లా సమీక్షా సమావేశం శనివారం జరుగుతుందని కలెక్టర్ అంబేద్కర్ ఒక తెలిపారు. జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి వంగలపూడి అనిత ఆధ్వర్యంలో కలెక్టరేట్ సమావేశ మందిరంలో మధ్యాహ్నం 2 గంటలకు సమావేశం జరుగుతుందని తెలిపారు. ఈ సమావేశంలో జిల్లా మంత్రి కొండపల్లి శ్రీనివాస్, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేషన్ చైర్మన్లు, ఇతర ప్రజా ప్రతినిధులు, ఉన్నతాధికారులు పాల్గొని జిల్లా అభివృద్ధిపై చర్చిస్తారన్నారు.

News November 29, 2024

విశాఖ డెయిరీపై విచారణకు ప్రత్యేక హౌస్ కమిటీ

image

విశాఖ డెయిరీపై విచారణకు ప్రత్యేక హౌస్ కమిటీని స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు నియమించారు. కమిటీ ఛైర్మన్‌గా జ్యోతుల నెహ్రూ, సభ్యులుగా బొండా ఉమామహేశ్వరరావు, వెలగపూడి రామకృష్ణబాబు, పల్లా శ్రీనివాసరావు, గౌతు శిరీష, ఆర్‌విఎస్ కేకే.రంగారావు, దాట్ల సుబ్బరాజులను నియమించారు. సమగ్ర విచారణ జరిపి రెండు నెలల లోపు నివేదిక సమర్పించాలని స్పీకర్ ఆదేశించారు.

News November 29, 2024

మీ ప్రాంతంలో ధాన్యం సేకరణ ఎలా ఉంది?

image

విజయనగరం జిల్లా వ్యాప్తంగా వరికోతలు ముమ్మరంగా సాగుతున్నాయి. పలు ప్రాంతాల్లో వరి నూర్పులు పూర్తి కాగా పండించిన పంటను ధాన్యం కోనుగోలు కేంద్రాలకు తరలిస్తున్నారు. ఈ ఏడాది జిల్లాలో 3.25 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కోనుగోలు చేయాలని అధికారులు లక్ష్యంగా పెట్టుకోగా.. ధాన్యం సేకరణకు రైతు భరోసా కేంద్రాలను 250 క్లస్టర్లుగా ఏర్పాటు చేశారు. మరి మీ ప్రాంతంలో ధాన్యం కొనుగోలు సేకరణ ఎలా ఉందో కామెంట్ చేయండి.