News July 19, 2024

విజయనగరం జిల్లాలో విద్యాసంస్థలకు సెలవు

image

బంగాళాఖాతంలో అల్పపీడనం కారణంగా జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ బిఆర్ అంబేడ్క‌ర్ కోరారు. ఈ నేపథ్యంలో శనివారం జిల్లాలోని అన్ని విద్యా సంస్థలకు సెలవు ప్రకటిస్తున్నట్లు తెలిపారు. గ్రామాల్లో సిబ్బంది అప్రమత్తంగా ఉండాలన్నారు.

Similar News

News October 15, 2024

సిరిమానోత్సవంలో ప్రజా ప్రతినిధుల సందడి

image

పైడితల్లి సిరిమానోత్సవ ఘట్టంలో పలువురు ప్రజాప్రతినిధులు సందడి చేశారు. మంత్రులు కొండపల్లి శ్రీనివాస్, గుమ్మడి సంధ్యారాణి, స్థానిక ఎమ్మెల్యే అదితి గజపతిరాజు, ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు, ఎమ్మెల్సీ పెనుమత్స సురేష్ బాబు, తదితరులు సిరిమానుతో పాటు తిరిగి భక్తులకు అభివాదం చేస్తూ ముందుకు సాగారు. సిరిమాను ఘట్టం ముగింపు వరుకు పర్యటించి సందడి చేశారు.

News October 15, 2024

విజయనగరంలో RRR సెల్ఫీ

image

ఉండి నియోజకవర్గ ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు విజయనగరం పట్టణంలో మంగళవారం సందడి చేశారు. విజయనగరం శ్రీ పైడితల్లి అమ్మవారి సిరి మానోత్సవానికి విచ్చేసిన ఆయన అమ్మవారి దర్శనం అనంతరం.. కేంద్ర మాజీ మంత్రి పూసపాటి అశోక్ గజపతిరాజును మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం జరిగిన సిరిమానోత్సవంలో పలువురు కోరిక మేరకు సెల్ఫీలు దిగి సందడి చేశారు.

News October 15, 2024

ఉమ్మడి విజయనగరం జిల్లాకు ఇన్‌ఛార్జ్ మంత్రుల నియామకం

image

ఉమ్మడి విజయనగరం జిల్లాకు ఇన్‌ఛార్జ్ మంత్రులను కేటాయిస్తూ రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. విజయనగరం జిల్లా ఇన్‌ఛార్జ్ మంత్రిగా రాష్ట్ర హోం మంత్రి వంగలపూడి అనిత, పార్వతీపురం మన్యం జిల్లా ఇన్‌ఛార్జ్ మంత్రిగా కింజరాపు అచ్చెన్నాయుడు నియమితులయ్యారు. ఇక నుంచి వారు జిల్లా కార్యకలాపాల్లో భాగస్వామ్యం కానున్నారు.