News March 21, 2024
విజయనగరం: నీళ్ల ట్యాంకులో పడి బాలుడు మృతి

తోటి పిల్లలతో కలిసి సరదాగా ఆడుకోడానికి వెళ్లిన దాసరి సిద్దు(7) అనే బాలుడు ప్రమాదవశాత్తు స్నానాలు చేసే నీళ్ల ట్యాంకులో పడి మృతి చెందిన సంఘటన భోగాపురం మండలం దెబ్బలపాలెంలో చోటుచేసుకుంది. బొబ్బిలికి చెందిన దాసరి నరసింహారావు భార్యాబిడ్డలతో కూలి పనుల కోసం భోగాపురం వచ్చారు. వారు పనులు చేస్తుండగా కుమారుడు ఆడుకోవడానికి వెళ్లి ట్యాంక్‌లో పడి చనిపోయాడని వారు ఇచ్చిన ఫిర్యాదుపై పోలీసులు కేసు నమోదు చేశారు.
Similar News
News April 20, 2025
మామిడి రైతులకు అన్ని విధాల సహకారం అందిస్తాం: మంత్రి

జిల్లాలో మామిడి పండించే రైతులకు అన్ని విధాలా సహకారం అందిస్తామని, వారు ఎదగడానికి ఏ రకమైన సహకారం కావాలో తెలియజేయాలని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అన్నారు. శనివారం విజయనగరంలోని ఓ హోటల్‌లో రైతులతో సమావేశం నిర్వహించారు. మంత్రి మాట్లాడుతూ.. రైతులు పంటను పరిరక్షించుకోడానికి కావలసిన సాంకేతికతను కూడా తెలుసుకోవాలని, ఇతర రాష్ట్రాల్లో అమలవుతున్న పద్ధతులను కూడా తెలుసుకోవాలని తెలిపారు.
News April 19, 2025
పూసపాటిరేగ: విచారణకు హాజరైన నటి శ్రీరెడ్డి

సోషల్ మీడియాలో అనుచిత పోస్టులు పెట్టిన కేసులో నటి శ్రీ రెడ్డికి పోలీసులు నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆమె పూసపాటిరేగ పోలీస్ స్టేషన్‌కు విచారణ నిమిత్తం తన లాయర్లతో కలిసి శనివారం హాజరయ్యారు. సీఐ జి.రామకృష్ణ ఆమెను విచారించి పలు విషయాలు సేకరించారు. అవసరమైతే మళ్లీ విచారణకు రావాల్సి ఉంటుందన్నారు. కాగా గతంలో నెల్లిమర్ల స్టేషన్‌లో శ్రీ రెడ్డిపై కేసు నమోదయింది.
News April 19, 2025
బొత్స వ్యూహాలు ఫలించేనా

విశాఖలో ఉదయం 11 గంటలకు GVMC మేయర్‌పై అవిశ్వాస ఓటింగ్ జరగనుంది. అవిశ్వాసం నెగ్గేందుకు అవసరమైన బలం కూటమికి ఉందని MLAలు చెబుతున్నారు. YCP కార్పొరేటర్‌లు ఓటింగ్‌కు దూరంగా ఉండాలంటూ MLC బొత్స పిలుపునిచ్చారు. అదిష్టానం నిర్ణయాన్ని దిక్కరిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కాగా కూటమిలోని పలువురు కార్పొరేటర్‌లతో బొత్స సంప్రదింపులు చేస్తున్నట్లు సమాచారం. మరి మేయర్ పీఠంపై బొత్స వ్యూహాలు ఫలిస్తాయా?