News November 20, 2024

విజయనగరం పూర్వ జేసీని సస్పెండ్ చేయాలని సిఫార్సు

image

విజయనగరం జిల్లాలో పని చేసిన సమయంలో భూ అక్రమాలకు వత్తాసు పలికారనే ఆరోపణలు వచ్చిన నాటి జేసీ కిషోర్ కుమార్‌ను సస్పెండ్ చేయాలని బుధవారం అసెంబ్లీలో సభ్యులు సిఫార్సు చేశారు. ఇప్పటికే అతని మీద జరిగిన విచారణ నివేదిక సాదారణ పరిపాలన శాఖ పరిశీలనలో ఉంది. ప్రస్తుతం కిషోర్ కుమార్‌కు పోస్టింగ్ ఇవ్వకుండా వెయిటింగ్‌లో ఉంచారు. అసెంబ్లీ సిఫార్సుల మేరకు ప్రభుత్వం ఏం చర్యలు తీసుకుంటుందో వేచి చూడాలి.

Similar News

News November 20, 2024

నేరాలు జరగకుండా జాగ్రత్తగా ఉండండి: SP

image

సైబర్ నేరాల నియంత్రణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని మన్యం జిల్లా పార్వతీపురం ఎస్పీ SV మాధవరెడ్డి సూచించారు. పార్వతీపురం పోలీస్ వెల్ఫేర్ ఫంక్షన్ హాలులో జిల్లాలోని బ్యాంకు అధికారులతో సమావేశం ఏర్పాటు చేశారు. సైబర్ నేరాలు జరిగిన తరువాత బాధపడే కన్నా నేరం జరగకుండా తగు జాగ్రత్తలు పాటించడం మేలన్నారు. దర్యాప్తు అధికారులు కోరిన సమాచారం అందించి సైబర్ నేరాల నియంత్రణకు అధికారులు కృషి చేయాలని కోరారు.

News November 20, 2024

నెల్లిమర్ల జూట్ మిల్లు తెరిచేదెప్పుడు?

image

నెల్లిమర్ల జూట్ మిల్లుకు ఘనమైన చరిత్ర ఉంది. 1920లో మిల్లు ప్రారంభం కాగా అప్పట్లో సమీప 45 గ్రామాలకు చెందిన సుమారు 11వేల మంది కార్మికులు ఉపాధి పొందేవారు. తరచూ మిల్లు మూతబడటంతో ఆ సంఖ్య నేటికి 2వేలకు పడిపోయింది. జూట్ కొరతతో మిల్లును నడపలేకపోతున్నామని యాజమాన్యం చెబుతోంది. ఆరు నెలల క్రితం మిల్లు లాకౌట్ ప్రకటించడంతో కార్మికులు ఇబ్బందులు పడుతున్నారు. ఇదే అంశంపై నిన్న శాసన మండలిలో చర్చకు వచ్చింది.

News November 20, 2024

VZM: ‘ప్రతి ఇంటికి మరుగుదొడ్డి తప్పనిసరి’

image

మరుగుదొడ్డి అనేది ఆత్మ గౌరవానికి చిహ్నమని, ప్రతి ఇంటికి మరుగుదొడ్డి తప్పనిసరిగా ఉండాలని, లేని వారికీ వెంటనే మంజూరు చేయడం జరుగుతుందని కలెక్టర్ అంబేడ్కర్ తెలిపారు. ప్రపంచ మరుగుదొడ్ల దినోత్సవంలో భాగంగా కలెక్టరేట్‌లో జరిగిన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. జిల్లా అంతటా ఆరోగ్యకరమైన వాతావరణాన్ని ఏర్పాటు చేయడంలో ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు.