News December 6, 2024
విజయనగరం: పెరిగిన గుడ్డు ధర..!
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_122024/1733452944052_50134108-normal-WIFI.webp)
గుడ్డు ధర భారీగా పెరిగింది. విజయనగరం రైతు బజారులో రూ.6.34కు విక్రయిస్తున్నారు. రిటైల్ షాపుల్లో రూ.7 అమ్ముతున్నారు. కాగా.. విజయనగరం రైతు బజారులో శుక్రవారం కూరగాయల ధరలు ఈ విధంగా ఉన్నాయి. (KGలో) వంకాయ రూ.35, టమాటా రూ.45-48, బెండ రూ.30, కాకర రూ.35, బీరకాయ రూ.40, క్యాబేజీ రూ.38, క్యారెట్ రూ.55-70, దొండకాయలు రూ.30కి అమ్ముతున్నారు. మరి మీ దగ్గర కూరగాయలతో పాటు గుడ్డు ధర ఎంత ఉందో కామెంట్ చెయ్యండి.
Similar News
News December 27, 2024
VZM: షెడ్యూల్డు కులాల సర్వే నివేదిక సచివాలయాల్లో ప్రదర్శన
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_122024/1735212076544_52016869-normal-WIFI.webp)
సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు షెడ్యూల్డ్ కులాల సర్వే నివేదికను జిల్లా వ్యాప్తంగా ఉన్న 530 గ్రామ సచివాలయాలు, పట్టణ ప్రాంతాల్లోని 96 వార్డు సచివాలయాల్లో గురువారం ప్రదర్శించారు. దీనిపై ఏమైనా అభ్యంతరాలు ఉన్నట్లయితే తెలపవచ్చని కలెక్టర్ అంబేడ్కర్ తెలిపారు. ఈ నెల 31వ వరకు ప్రజల నుంచి అభ్యంతరాలు స్వీకరించి జనవరి 6వ తేదీలోగా ఆన్లైన్ చేస్తామన్నారు.
News December 26, 2024
విజయనగరం: పోలీస్ ఉద్యోగమే లక్ష్యం
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_122024/1735174431728_51051382-normal-WIFI.webp)
రాష్ట్రంలో 6,100 కానిస్టేబుల్ నోటిఫికేషన్‌కి సంబంధించి ప్రభుత్వం ప్రక్రియను వేగవంతం చేయడంతో కానిస్టేబుల్ అభ్యర్థులు తీవ్రంగా శ్రమిస్తున్నారు. విజ్జీ, రాజీవ్, అయోధ్య, మైదానాలన్నీ అభ్యర్థులతో నిండిపోయాయి. వర్షంతో మైదానాలు బురదమయం కాగా ఖాకీ కొలువు కోసం యువత అవరోధాలను అధిగమించి ప్రాక్టీస్ ముమ్మరం చేస్తున్నారు. వీరికి ఈనెల 30వ తేదీ నుంచి జిల్లా పెరేడ్ గ్రౌండ్లో ఈవెంట్స్ జరగనున్నాయి.
News December 26, 2024
విజయనగరం మీదుగా వెళ్లే రైళ్లకు అదనపు కోచ్‌లు
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_122024/1735176561931_1258-normal-WIFI.webp)
సంక్రాంతి సీజన్ సందర్భంగా పలు రైళ్లకు అదనపు కోచ్‌లను జత చేస్తున్నట్లు వాల్తేరు డివిజన్ డిఆర్ఎం సందీప్ బుధవారం తెలిపారు. విశాఖ-గుణపూర్-విశాఖ పాసింజర్ స్పెషల్‌కు జనవరి ఒకటి నుంచి 31 వరకు ఒక స్లీపర్ క్లాస్ కోచ్‌ను జత చేస్తున్నారన్నారు. భువనేశ్వర్-తిరుపతి సూపర్ ఫాస్ట్ ఎక్స్ ప్రెస్‌కు జనవరి 4 నుంచి 25 వరకు, తిరుగూ ప్రయాణంలో జనవరి 5 నుంచి 26 వరకు ఒక థర్డ్ ఏసీ కోచ్‌ను జత చేస్తున్నట్లు తెలిపారు.