News March 23, 2025

విజయనగరం పోలీసుల సేవలకు గుర్తింపు

image

రాష్ట్ర ప్రభుత్వం అందజేయనున్న ఉగాది పురస్కారాలకు విజయనగరం పోలీస్ శాఖలో పనిచేస్తున్న పలువురు సిబ్బంది ఎంపికయ్యారు. స్థానిక ఎస్బి ఎస్ఐ వై.సత్యనారాయణ, ఎస్సీ, ఎస్టీ సెల్ ASI ప్రసాదరావు, ఆర్మడ్ రిజర్వ్ ఏఆర్ SI అప్పలరాజు, AR హెడ్ కానిస్టేబుల్ గోవిందం, AR కానిస్టేబుల్ శ్రీనివాసరావు ఉగాది పురస్కారాలకు ఎంపికైనట్లు ఎస్పీ ఆదివారం తెలిపారు. ఈ సందర్భంగా ఎంపికైన వారికి శుభాకాంక్షలు తెలిపారు.

Similar News

News March 26, 2025

కలెక్టర్ల సమావేశంలో పాల్గొన్న విజయనగరం జిల్లా కలెక్టర్ 

image

విజయవాడలో జరుగుతున్న రెండు రోజుల కలెక్టర్ల సమావేశంలో విజయనగరం జిల్లా కలెక్టర్ డా.బి.ఆర్. అంబేడ్కర్ పాల్గొన్నారు. జిల్లాలో జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల గురించి నివేదిక ఉన్నతాధికారులకు అందజేశారు. పెండింగ్ పనులు పూర్తి చేయడానికి అవసరమైన నిధులు, అనుమతులు గురించి చర్చించారు. జిల్లాలో టూరిజం అభివృద్ధి, వేసవిలో త్రాగునీటి ఇబ్బందులు లేకుండా తీసుకోవాల్సిన చర్యలు గురించి చర్చించారు.

News March 25, 2025

నెల్లిమర్ల: నర్సింగ్ విద్యార్థులకు ఉద్యోగ అవకాశాలు

image

రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో నర్సింగ్ విద్యార్థులకు జర్మన్ భాషలో ఉచితంగా శిక్షణ ఇచ్చి ఉద్యోగ అవకాశాలు కల్పించనున్నట్లు స్కిల్బీ సంస్థ ప్రతినిధి ఉజ్వల్ తెలిపారు. నెల్లిమర్ల MIMSలో నర్సింగ్ విద్యార్థులకు మంగళవారం అవగాహన కల్పించారు. ప్రభుత్వ సహకారంతో ఎనిమిది నెలల శిక్షణ అనంతరం జర్మనీలో రూ.2.50 లక్షల నుంచి రూ.3.50 లక్షల జీతంతో ఉద్యోగాలు కల్పిస్తామన్నారు.

News March 25, 2025

బొబ్బిలిలో విషాదం.. అపార్ట్‌మెంట్‌పై నుంచి పడి రిటైర్డ్ HM మృతి 

image

బొబ్బిలిలో మంగళవారం విషాదం చోటుచేసుకుంది. నాయుడుకాలనీలో అపార్ట్మెంట్ పైనుంచి ప్రమాదవశాత్తూ జారిపడి రిటైర్డ్ హెచ్ఎం వై.శ్యామసుందర్(80) మృతి చెందారు. కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన బాల్కనీలో నిల్చున్న ఆయన కళ్లు తిరిగి పడిపోయారు. ఆయన స్వగ్రామం పాల్తేరు కాగా అదే గ్రామంలో HMగా రిటైర్ అయ్యారు. ఇద్దరు కుమారులు కాగా.. ఒకరు డాక్టర్‌గా, మరో కుమారుడు సచివాలయ ఉద్యోగిగా పనిచేస్తున్నారు. 

error: Content is protected !!