News June 8, 2024

విజయనగరం : ప్రశాంతంగా ముగిసిన ప్రవేశ పరిక్ష

image

బిఈడి ప్రవేశాలకు సంబందించిన ఎడ్ సెట్-2024 ప్రవేశ పరిక్ష శనివారం ప్రశాంతంగా ముగిసింది. పరీక్షకు 90% మంది విద్యార్థులు హాజరయ్యారని అబ్జర్వర్ డాక్టర్ శ్రీనివాస మోహన్ తెలిపారు. ఈ పరీక్షకు MVGR కళాశాలలో 120 మందికి 103 మంది విద్యార్థులు, సీతం ఇంజినీరింగ్ కళాశాలలో 150 మందికి 131 మంది విద్యార్థులు, ఐయాన్ డిజిటల్ పరీక్ష కేంద్రంలో 500 మందికి 454 మంది విద్యార్థులు హాజరయ్యారని తెలియజేసారు.

Similar News

News November 28, 2024

విజయనగరం జిల్లాకు DIG గోపీనాధ్ జెట్టీ రాక

image

విశాఖ రేంజ్ డీఐజీ గోపీనాథ్ జెట్టీ జిల్లాలో గురువారం పర్యటించనున్నారు. జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ ఆధ్వర్యంలో స్థానిక పోలీసు పరేడ్ గ్రౌండ్‌లో పోలీసు ఉద్యోగులకు వార్షిక క్రీడా పోటీలను నిర్వహించనున్నారు. ఈ క్రీడా పోటీలను డీఐజీ గోపీనాథ్ జట్టి గురువారం ఉదయం 8గంటలకు ప్రారంభించనున్నారు. కాగా ఈ పోటీలు ఈ నెల 30 వరుకు కొనసాగనున్నాయి.

News November 27, 2024

పంచగ్రామాల సమస్య.. అశోక్‌తో విశాఖ ఎమ్మెల్యేలు భేటీ

image

కేంద్ర మాజీ మంత్రి పూసపాటి అశోక్ గజపతిరాజును టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ బుధవారం మర్యాదపూర్వకంగా కలిశారు. సింహాచల దేవస్థానం పంచ గ్రామాల భూముల క్రమబద్దీకరణపై అశోక్ తో చర్చించారు. విశాఖ జిల్లా ఎమ్మెల్యేలు విష్ణుకుమార్ రాజు, వెలగపూడి రామకృష్ణ బాబు, పంచకర్ల రమేష్, తదితరులు అశోక్ ను కలిసిన వారిలో ఉన్నారు. కార్యక్రమంలో మంత్రి కొండపల్లి శ్రీనివాస్ పాల్గొన్నారు.

News November 27, 2024

చింతలవసలో విదర్భ-పాండిచ్చేరి మ్యాచ్

image

డెంకాడ మండలం చింతలవలస ACA క్రికెట్ అకాడమి స్టేడియంలో విదర్భ, పాండిచ్చేరి మధ్య జరుగుతున్న సయ్యద్ ముస్తాక్ అలీ టోర్నీను మాజీ మంత్రి, ఏపీ అటవీ అభివృద్ది కార్పొరేషన్ ఛైర్మన్ సుజయ్ కృష్ణ రంగారావు బుధవారం తిలకించారు. ఈ సందర్భంగా క్రీడాకారులను పరిచయం చేసుకుని కాసేపు వాళ్లతో ముచ్చటించారు. కార్యక్రమంలో ACA కార్యదర్శి సానా సతీష్ పాల్గొన్నారు.