News March 6, 2025

విజయనగరం: ‘లెక్కలు పరీక్షకు 999 మంది గైర్హాజరు

image

విజయనగరం జిల్లాలో 66 కేంద్రాల్లో గురువారం జరిగిన ఇంటర్ మొదటి సంవత్సరం లెక్కలు పరీక్షకు 999 మంది విద్యార్థులు గైర్హాజరు అయ్యారని ఆర్‌ఐ‌వోఎం ఆదినారాయణ ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లా వ్యాప్తంగా లెక్కలు పరీక్షకు 23,044 మంది విద్యార్థులు హాజరు కావాల్సి ఉండగా వారిలో 22,045 మంది మాత్రమే హాజరయ్యారని పరీక్ష ఏటువంటి అవాంచనీయ ఘటనలు లేకుండా ప్రశాంతంగా జరిగిందని తెలిపారు.

Similar News

News March 7, 2025

VZM: ‘పోల‌వ‌రం ప్ర‌ధాన కాల్వ భూసేక‌ర‌ణ ప్రారంభించాలి’

image

ఉత్త‌రాంధ్ర సుజ‌ల స్ర‌వంతి ప్రాజెక్టులో భాగంగా జిల్లాలో పోల‌వరం ప్ర‌ధాన కాల్వ నిర్మాణానికి అవ‌స‌ర‌మైన భూసేక‌ర‌ణ ప్ర‌క్రియ‌ను వెంట‌నే ప్రారంభించాల‌ని క‌లెక్ట‌ర్ అంబేడ్కర్ రెవిన్యూ అధికారుల‌ను ఆదేశించారు. భూసేక‌ర‌ణ‌పై క‌లెక్ట‌ర్ గురువారం త‌న ఛాంబ‌రులో జ‌ల‌వ‌న‌రుల శాఖ‌, భూసేక‌ర‌ణ అధికారుల‌తో స‌మీక్షించారు. విజయనగరం జిల్లాలోని మూడు భూసేక‌ర‌ణ యూనిట్ల ఆధ్వ‌ర్యంలో శుక్ర‌వారం నుంచే ప్రారంభించాలన్నారు.

News March 6, 2025

VZM: జిల్లా జడ్జిలతో ప్రధాన న్యాయమూర్తి సమావేశం

image

పట్టణంలోని స్థానిక జిల్లా కోర్టులో జడ్జిలతో జిల్లా ప్రధాన న్యాయమూర్తి సాయి కళ్యాణ్ చక్రవర్తి గురువారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈనెల 8న జరగనున్న జాతీయ లోక్ అదాలత్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సూచించారు. రాజీకు వచ్చే క్రిమినల్, మోటార్, ప్రమాద బీమా, బ్యాంక్, చెక్ బౌన్స్, తదితర కేసులను ఇరు పార్టీల సమక్షంలో పరిష్కరించలన్నారు.

News March 6, 2025

VZM: ఈ నెల 8 నుంచి 18 వరకు పి-4 సర్వే

image

పబ్లిక్ ప్రైవేటు పీపుల్స్ పార్టిసిపేషన్‌( పి-4) సర్వే ఈ నెల 8 నుంచి 18 వరకు జరుగుతుందని కలెక్టర్ అంబేడ్కర్ తెలిపారు. గురువారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో పి-4 సర్వే పై అధికారులకు అవగాహన సదస్సు నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. స్వర్ణాంధ్ర సాధనకు 10 సూత్రాలను ప్రభుత్వం అమలు చేస్తోందని, ప్రధానంగా జీరో పేదరికం లక్ష్యంలో భాగంగా ప్రభుత్వం పి-4 కార్యక్రమం చేపడుతోందని కలెక్టర్ తెలిపారు.

error: Content is protected !!