News March 28, 2025
విజయనగరంలో బాలికపై బాలుడు అత్యాచారయత్నం

విజయనగరం రూరల్ పరిధిలో బాలికపై ఓ బాలుడు అత్యాచారయత్నానికి పాల్పడినట్లు రూరల్ ఎస్ఐ అశోక్ కుమార్ తెలిపారు. ఈనెల 26న ఈ ఘటన జరగ్గా కేసు నమోదు చేశామన్నారు. ఇంటిలో ఒంటరిగా నిద్రిస్తున్న సమయంలో బాలుడు అత్యాచారయత్నానికి ప్రయత్నించాడు. బాలిక కేకలు వేయడంతో బాలుడు పరారయ్యాడన్నారు. దీనిపై బాలిక కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేశామన్నారు.
Similar News
News April 2, 2025
VZM: ‘మహిళల జీవనోపాధి కార్యక్రమాలు మరింత విస్తృతం చేయాలి’

మహిళలకు జీవనోపాధి అవకాశాలు, ఆదాయం పెంపొందించే కార్యక్రమాలు మరింత విస్తృత స్థాయిలో చేపట్టేందుకు గల అవకాశాలపై ప్రతిపాదనలు ఇవ్వాలని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అధికారులకు ఆదేశించారు. స్థానిక డీఆర్డీఏ సమావేశ మందిరంలో మంగళవారం సమీక్ష జరిపారు. మహిళలతో రానున్న రోజుల్లో వ్యవసాయ అనుబంధ కార్యకలాపాలు, లాభదాయక పంటల సాగు చేపట్టేలా చర్యలు తీసుకోవాలని కోరారు. ఆదాయం పెంచే కార్యక్రమాలు చేయాలన్నారు.
News April 1, 2025
VZM: 10వ తరగతి పరీక్షకు 133 మంది గైర్హాజరు

విజయనగరం జిల్లాలో పదో తరగతి పబ్లిక్ పరీక్షలు మంగళవారంతో ప్రశాంతంగా ముగిశాయని డీఈవో మాణిక్యాలరావు తెలిపారు. సోషల్ పరీక్షకు 133 మంది గైర్హాజరైనట్లు పేర్కొన్నారు. సోషల్ పరీక్షకు జిల్లా వ్యాప్తంగా 22,862 మంది హాజరు కావాల్సి ఉండగా 22,774 మంది హాజరయ్యారన్నారు. రెగ్యులర్ 88 మంది విద్యార్థులు గైర్హాజరుకాగా, ప్రైవేటు విద్యార్థులు 116మందికి గాను 45 మంది గైర్హాజరయ్యారని తెలిపారు.
News April 1, 2025
‘యువతిని చంపి 100 కి.మీలు బైక్‌పై తీసుకొచ్చారు’

సాలూరులో <<15956319>>యువతి హత్య<<>> కేసును పోలీసులు చేధించిన విషయం తెలిసిందే. యువతి మెడపై 2 గాయాలు ఉండడంతో పోలీసులు దర్యాప్తు చేపట్టగా అసలు నిజం వెలుగులోకి వచ్చింది. రాంబాబు ఐశ్యర్యను విశాఖ జిల్లా ఆరిలోవలోని ఓ రూములో చంపినట్లు తేలింది. అక్కడి నుంచి స్నేహితుల సాయంతో సాయంతో డెడ్‌బాడీని బైక్‌పై 100 KM తీసుకొచ్చి చెట్టుకు వేలాడదీశాడు. బైక్‌పై వచ్చినప్పుడు రికార్డ్ అయిన CC ఫుటీజీ ఆధారంగా రాంబాబును అరెస్ట్ చేశారు.